Advertisementt

ఈ బాలీవుడ్‌ సీనియర్‌.. బాలయ్య టైప్‌!

Wed 17th Jan 2018 12:57 AM
rishi kapoor,loses,cool yet again,young female fan  ఈ బాలీవుడ్‌ సీనియర్‌.. బాలయ్య టైప్‌!
Did Rishi Kapoor yell at a female fan and make her cry? ఈ బాలీవుడ్‌ సీనియర్‌.. బాలయ్య టైప్‌!
Advertisement
Ads by CJ

బాలయ్య అభిమానులతో ఏ మూడ్‌లో ఎలా ఉంటాడు? ఎప్పుడు ఎలా రియాక్ట్‌ అవుతాడు? అనేది ఎవ్వరికీ అర్ధం కాదు. కొట్టినా కొడతాడు. ఇప్పటికే ఎందరికో తన చేతి పవర్‌ని చూపించాడు. దాంతో ఆయనతో మాట్లాడాలంటేనే అందరు భయపడుతూ ఉంటారు. ఇక ఈయన షూటింగ్స్‌లో కూడా ఇదే టైప్‌. ఇక తమిళనాట విజయ్‌కాంత్‌కి, బాలీవుడ్‌లో సీనియర్‌ హీరో రిషికపూర్‌లది కూడా అదే దారి. ఇక నిత్యం ఏదో వివాదం చేసి వార్తల్లో ఉండే రిషికపూర్‌ గతంలో వినోద్‌ఖన్నా మృతి సందర్భంగా నేటి స్టార్స్‌ ఎవరు ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేదని, రేపు తాను మరణించినా ఎవ్వరూ రాకపోవచ్చని, పెద్దలను మనం గౌరవించే విధానం ఇదేనా అని స్టార్స్‌పై మండిపడ్డాడు.

ఇక తన కుమారుడు రణబీర్‌ కపూర్‌ కూడా ఈ అంత్యక్రియలకు రాలేదు మరి మీ కుమారుడు కూడా రాలేదు కదా? అని ప్రశ్నిస్తే వచ్చే వాడని, కానీ విదేశాలలో ఉండి రాలేకపోయాడని తెలిపాడు. ఈయన ధోరణిని చూసి ఆయన కుమారుడులాగానే మిగిలిన వారికి కూడా పనులుంటాయని, హాజరుకాలేకపోవచ్చని ఆయనకు తెలియదా? అని ఖాన్‌ త్రయం అభిమానులు ఆయనపై మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన ఏ సంబంధం, సందర్భం లేకుండానే పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ పాకిస్తానే కానీ మన వారిది కాదని కారుకూతులు కూశాడు.

ఇక తాజాగా ఆయన ముంబైలోని బాంద్రా వంటి పోష్‌ ఏరియాలో ఉండే ఓ రెస్టారెంట్‌కి ఫ్యామిలీతో సహా వెళ్లాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని, అందునా మహిళా అభిమాని ఆయనతో ఫొటో దిగేందుకు ప్రయత్నించడంతో ఆయన ఆమెను నానా తిట్లు తిట్టాడు. ఇందంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అభిమానిని అందునా ఓ మహిళను అలా తిట్టడం ఏమిటనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన పక్కనే ఉన్న ఆయన కుమారుడు హీరో రణబీర్‌కపూర్‌ కూడా తన తండ్రిని వారించే పని చేయకుండా మౌనంగా ఉండటం మరింతగా విమర్శలకు దారి తీస్తోంది. రిషికపూర్‌ అలా తిట్టడంతో ఆ మహిళాభిమాని కన్నీరు పెట్టుకుంది.

Did Rishi Kapoor yell at a female fan and make her cry?:

Rishi Kapoor Loses His Cool YET AGAIN, Yells At A Young Female Fan!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ