Advertisementt

గుళ్లు, గోపురాలకి రెడీ అంటోంది!

Wed 17th Jan 2018 12:56 AM
namitha,fans,wants,more temples,honour  గుళ్లు, గోపురాలకి రెడీ అంటోంది!
Namitha wants more Temples in her Honour గుళ్లు, గోపురాలకి రెడీ అంటోంది!
Advertisement
Ads by CJ

నిజంగా నేడు సినిమా పిచ్చి, వీరాభిమానం విపరీతంగా పెరుగుతోంది. నాటి రోజుల కంటే ఇది నేడు మరింత ఉద్దృతం అవుతోంది. కులాల వారీగా, అభిమానాల పేరిట వీరాభిమానులు నానా రచ్చ చేస్తున్నారు. తమ హీరోలను దేవుళ్లుగా భావిస్తున్నారు. ఇక తమిళనాడులో కేవలం స్టార్‌ హీరోలకే కాదు ఖుష్బూ, నయనతార, నమిత వంటి వారికి ఏకంగా గుళ్లు కట్టారు.

దీనిపై తాజాగా నమిత స్పందిస్తూ, నా అభిమానుల ప్రేమను, ఆదరణను, ఆప్యాయతలను నేను గౌరవిస్తాను. అభిమానులతో మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇస్తాను. ఒక వేళ నాకు ఆరోగ్యం బాగాలేని సమయంలో కూడా ఎవరైనా అభిమాని అడిగితే అన్నింటినీ పక్కనపెట్టి వారితో ఫొటోలు దిగుతాను. ఇక నేను చిన్ననాటి నుంచి నాగార్జున గారికి వీరాభిమానిని, ఆయన నటించిన 'ఖుదాగవా' చూస్తూ పెరిగాను. ఆయన అందం చూసి నాడే నేను ముగ్డురాలినయ్యాను. నాగార్జునలానే ఉంటాడని అందరూ చెప్పుకునే వీర్‌ అలియాస్‌ వీరేంద్రచౌదరిని వివాహం చేసుకోవడం ఆనందంగా ఉంది. దేవుడు అది నాకు ఇచ్చిన అదృష్టం. ఇక నేను ఇప్పటివరకు నాకు తెలిసి ఏ అభిమానిని ఇబ్బంది పెట్టలేదు. నాలోని అభిమానులతో కలిసి పోయే తత్వాన్నివారు బాగా ఇష్టపడ్డారు.

ఇక కోయంబత్తూరులో నమితకి వీరాభిమానులు ఉన్నారు. నమిత అందాన్ని, అమాయకమెనౖ ఆమె మోముని చూసి వారు అభిమానులుగా మారి ఆమె కోసం కోయంబత్తూరులో గుడి కట్టారని వీర్‌ చెబుతుంటే, ఇలా తనకి గుడి కట్టడాన్ని తాను గర్వంగా బావిస్తాను. అభిమానుల పనులకు నేను మద్దతు పలుకుతాను. వారిని నేను బాగా అర్దం చేసుకుంటాను అని నమిత చెప్పుకొచ్చింది.

Namitha wants more Temples in her Honour:

Fans are constructing a temple for top Tamil actress Namitha in Tirunelveli district and she says she wouldn't mind more shrines built in her honour.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ