సంక్రాంతికి వచ్చిన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తన 'అజ్ఞాతవాసి'తో పవర్‌పోగొట్టుకున్నాడు. మరోవైపు 'జైసింహా'తో వచ్చిన బాలయ్య గర్జించలేక చతికిల పడ్డాడు. వర్మ చెప్పినట్లు పవన్‌కళ్యాన్....పులిలా మారి... పాకడం మొదలుపెడితే, బాలయ్య 'అజ్ఞాతం'లోకి వెళ్లి పిల్లి కూతలు తప్ప సింహంలా గర్జించలేకపోయాడు. ఇక ఒకరు ఓ విదేశీ కాపీ చిత్రానికి జీవం పోసి, దొడ్డిదారిలో వచ్చి దెబ్బతింటే మరొకరు నేరుగా స్ట్రెయిట్ కథతో వచ్చి తలబొప్పి కట్టించారు. అయితే ఫ్రీమేక్‌తో హిట్ కొట్టే కంటే డైరెక్ట్ కథతో అరిచే ప్రయత్నం మాత్రం బాలయ్య చేశాడు.
ఇక పవన్ సినిమాలలో ఏదో నటిస్తున్నానని, తనకు సినిమాలలో యాక్టింగ్ చేయడం ఇష్టం లేదని తరుచు చెబుతుంటారు. ఈ విషయం 'అజ్ఞాతవాసి' చూసిన తర్వాత నిజమేననిపిస్తోంది. ఆయనకు నటనపై ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టమవుతోంది. 'సర్దార్ గబ్బర్‌సింగ్'లో పాటలకు లిప్ మూమెంట్ కూడా ఇవ్వని పవన్, మరోసారి ఈ చిత్రంలో కాలు తీసి కాలు వేయడం, స్టెప్స్ కూడా వేయలేని లేజీనెస్‌ని, నిర్లక్ష్యాన్ని చూపించాడు. ఇక త్రివిక్రమ్‌ది కూడా అదే బాపత్తు. నటన ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తే అది 'అజ్ఞాతవాసి'లా ఉంటుంది. మొక్కుబడిగా డబ్బు లకోసమైతే ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది వారి ఇష్టం.
ఇక ఆయన సినిమాలలో పాటలపై కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తన 25వ చిత్రంలో కూడా 'తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీ' వంటి సినిమాల నాటి నటనతోనే మెప్పించాలని చూస్తూ, తన నటనను నిరూపించుకోవడం, పాలిష్‌కొట్టుకోకపోతుండటం చూస్తే ఈయన నటన మొదటి స్థాయిలోనే మిగిలిపోయింది తప్ప ఎక్కడా పరిణతి కనిపించడం లేదు. ఈ విషయంలో బాలయ్య కాస్త ఫర్వాలేదు. తనదైన డైలాగ్స్‌తో పాటు ఎలాగైనా స్టెప్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్‌లో మెప్పించాలని విశ్వప్రయత్నం చేశాడు. కనీసం కసితోనైనా ఓ స్ట్రెయిట్ చిత్రంపై నమ్మకం ఉంచాడు. తనవంతు బాధ్యత మాత్రం నిర్వర్తించాడు. ఈ వయసులో కూడా బాలయ్య పడిన కష్టాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే.
కానీ ఈ తపన వయసులో చిన్నవాడైనా పవన్‌లో కనిపించలేదు. కనీసం పోరాడి ఓడాలి అనే బాధ్యతలేని ఇండియా క్రికెట్ టీమ్‌లా మొదటి దక్షిణాఫ్రికాతో టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్‌లాగా నిర్లక్ష్యంతో ఓడితే మాత్రం దానికి క్షమాపణ ఉండదు. మరి ఈ విషయంలో పవన్ తన నటనపై, కథల ఎంపికలో ఇకనైనా మనసు పెడుతాడో లేదో వేచిచూడాల్సివుంది...?!