సమంత మహా అల్లరిపిల్లే కాదు.. మంచి ఆలోచన భావాలను కలిగిన మనిషిగా చెప్పుకుంటారు. తనకు నచ్చిన విషయాలను ఈమె బహిరంగంగా చెప్పడానికి సంకోచించదు. బహుశా అదే గుణం అక్కినేని ఫ్యామిలీకి, చైతు, నాగ్‌లకు కూడా నచ్చిఉంటుంది. నాడు మహేష్ నటించిన '1 నేనొక్కడినే' అనే సినిమా స్టిల్ విషయంలో ఆమె విమర్శలు చేయడానికి ఏమాత్రం సందేహించలేదు. నాడు ఆమెకి శేఖర్ కమ్ములతోపాటు పలువురి మద్దతు కూడా లభించింది.
ఇక తాజాగా ఆమె తన చిన్ననాటి సంఘటనలను, భగవంతునిపై తన నమ్మకాన్ని తెలిపే వ్యాఖ్యలు చేసింది. మా ఇంట్లో వారు ప్రతి బుధ, శుక్ర, ఆదివారాలలో ఖచ్చితంగా చర్చికి వెళ్లేవారు. నేను చిన్నప్పుడు నాకు ఇష్టం లేకున్నా మా అమ్మ బలవంతంగా చర్చికి తీసుకుని వెళ్లేది. ఆ వయసులో నాకు అది బోర్ అనిపించేది. కానీ నేడు ఆలోచిస్తే మాత్రం ఆమె ప్రార్దనలే నాకు మంచి చేశాయని అనిపిస్తోంది. ఇక చిన్ననాడు నాకు ఓ సారి తీవ్ర అనారోగ్యం వచ్చింది. నాకు పరీక్షలు రాసే ఓపిక కూడా లేదు. కానీ మా అమ్మ నాకు తోడుగా రావడంతో ధైర్యంగా రాయగలిగాను. ఆమె అంతటి మనోధైర్యాన్ని ఇచ్చేది. మై మామ్ ఈజ్ రియల్లీ అమేజింగ్..అని చెప్పుకొచ్చింది.
నిజమే దేవుడు ఉన్నాడా? లేడా? అనేది పక్కనపెడితే భగవంతునిపై భారం అనేది కూడా మానసిక ధైర్యాన్నిఇస్తుందని, చిన్నవయసులో పెద్దలు చెప్పే మంచి మనకు చికాకుగా అనిపిస్తుందని ఆమె చెప్పిన విధానం మాత్రం సింప్లీ అమేజింగ్ అనే చెప్పాలి! ఇక ఈమె ప్రస్తుతం రామ్‌చరణ్ 'రంగస్థలం', 'మహానటి' చిత్రాలతో పాటు విశాల్ సరసన ఆమె నటించిన మూవీ 'అభిమన్యుడు' జనవరి 26న విడుదల కానుంది. ఈ మూడు చిత్రాలు దాదాపు మార్చి నెలాఖరుకల్లా విడుదలకు సిద్దమవుతుండటంతో ఈమె కన్నడ రీమేక్ 'యూటర్న్'పై దృష్టి పెట్టనుంది.