కెరియర్ స్టార్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవాడని తెలిసిన విషయమే. అతను బొద్దుగా ఉన్నా.. అతని సినిమాలు చూసి టాలీవుడ్ ప్రేక్షకులు అతన్ని ఎంకరేజ్ చేశారు. ఆ టైంలోనే ఎన్టీఆర్ కి ఆది - సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ లు కూడా వున్నాయి. మొదటి సినిమా నుండి రాఖి సినిమా వరకు అలానే కనిపించాడు తారక్. అయితే ఇలాగే ఉంటే కష్టమని గుర్తించి అందరు ఆశ్చర్యపోయేలా ఒళ్ళు తగ్గించుకుని మరీ స్లిమ్ లుక్ లోకి మారిపోవడం కంత్రి - యమదొంగ సినిమాల నుంచి మొదలైంది.
మళ్లీ రీసెంట్ గా వచ్చిన టెంపర్ - జనతా గ్యారేజ్ లో కొంచెం ఒళ్ళు చేసినట్టు కనిపించాడు. ఇక అభిమానులను థ్రిల్ ఇచ్చే న్యూస్ ఏంటంటే తారక్ మరోసారి పూర్తిగా తన బరువు తగ్గించుకుని న్యూ యంగ్ లుక్ లోకి మారిపోయాడట. అతనికి దగ్గరగా ఉండే తన ఫ్రెండ్ ఒకరు ఈ విషయాన్ని బయట పెట్టాడు.
తారక్ - త్రివిక్రమ్ సినిమా కోసమే ఇలా రెడీ అవుతున్నాడట. దాని కోసమే ఈ మార్పు అంట. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ త్వరలోనే షూట్ స్టార్ట్ చేస్తాడట. 'అజ్ఞాతవాసి' ఊహించని షాక్ ఇవ్వడంతో స్క్రిప్ట్ విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే అవకాశం లేకపోలేదు. త్రివిక్రమ్ టీం ప్రస్తుతం హీరోయిన్ ని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్టు తెలిసింది.