Advertisementt

'స్టాలిన్‌', 'అజ్ఞాతవాసి'.. ఖుష్బూ ఏంటిది?

Sun 14th Jan 2018 04:51 PM
agnathavasi,kushboo,pawan kalyan,re entry,stalin  'స్టాలిన్‌', 'అజ్ఞాతవాసి'.. ఖుష్బూ ఏంటిది?
Kushboo Effect On Agnathavasi Movie 'స్టాలిన్‌', 'అజ్ఞాతవాసి'.. ఖుష్బూ ఏంటిది?
Advertisement
Ads by CJ

దశాబ్దం కంటే ముందు మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అప్పటికే ఈయన పొలిటికల్‌ ఎంట్రీపై వార్తలు తీవ్రంగా వస్తున్నరోజుల్లో తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో చైన్‌ బిజినెస్‌ పాయింట్‌ని ఏదో కొత్తగా భ్రమించి, చైన్‌ హెల్ప్‌ కాన్సెప్ట్‌తో 'స్టాలిన్‌' చిత్రం రూపొందింది. అందులో ఖుష్బూ కీలకపాత్రను పోషించింది. ఆ చిత్రం నేటి 'అజ్ఞాతవాసి'లా భారీ అంచనాల మీద వచ్చి ఢబేల్‌ మంది. మరలా ఇంత కాలానికి ఖుష్బూ మెగాస్టార్‌ సోదరుడు పవర్‌స్టార్‌తో ఆయన పొలిటికల్‌ ఎంట్రీ నేపధ్యంలో త్రివిక్రమ్‌ వంటి దర్శకునితో 'అజ్ఞాతవాసి'లో నటించింది. నాటి 'స్టాలిన్‌' బాక్సాఫీస్‌ బూజును ఇప్పుడు 'అజ్ఞాతవాసి' దులుపుతోంది. ఇలా ఈమె పెద్ద ఐరన్‌లెగే అనిపించుకుంది. 

ఇక ఈమె తెలుగులో మొదటి సారి వెంకటేష్‌ హీరోగా పరిచయమైన 'కలియుగ పాండవులు' చిత్రంలో నటించింది. ఇక 'అజ్ఞాతవాసి'లో కూడా వెంకీ గెస్ట్‌ పాత్రను చేశాడు. కానీ అది స్క్రీన్‌పై కనిపించలేదు. అది వేరే సంగతి. ఇక ఇందులో ఇంటర్వెల్‌ ముందు వచ్చే పవన్‌, కీర్తిసురేష్‌లు మార్కెట్‌లో వస్తున్నప్పుడు సైలెంట్‌గా జరిగే ఫైట్‌ సీన్‌లో అసలు వెంకీ కనిపించాల్సి ఉందట. ఇక ఈయన పవన్‌తో కలిసి 'గబ్బర్‌సింగ్‌'లోని తిక్క, లెక్కల డైలాగ్స్‌ చెప్తాడట. కానీ సినిమా కార్డ్స్‌లో వెంకీకి కృతజ్ఞతల కార్డు కూడా వేశారు. ఇప్పుడు వెంకీ సీన్స్ ని యాడ్‌ చేయబోతున్నారు.  

మరోవైపు ఏపీలో అర్ధరాత్రి నుంచి షోలు ఇచ్చినా థియేటర్ల వారు షోలు వేయడం లేదు. ఫస్ట్‌షో, సెకండ్‌ షోలే ఫుల్‌కాని పరిస్థితిలో ఎవరు మాత్రం డేర్‌ చేస్తారు? ఇక ఈ చిత్రంలో తన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోందని ఖుష్బూ చెబుతోంది. బహుశా చెన్నైలో ఉన్న ఈమెకి ఈ చిత్రం టాక్‌ ఇంకా తెలిసింది? లేదా? అనేదే డౌట్‌. అసలు పవన్‌ పాత్రకే రెస్పాన్స్‌ రాకపోతుంటే ఈమె మాత్రం ఏదో ప్రమోషన్‌ చేద్దామని తన పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోందని చెబుతోంది. 

ఎంతో మంచి పాత్ర కోసం ఇంత కాలం తెలుగు, తమిళంలో యాక్ట్‌ చేయలేదు. దాంతో ఒకరోజున త్రివిక్రమ్‌ ఈ చిత్రం కథతో నా వద్దకు వచ్చాడు. వస్తూనే కథ కూడా చెప్పకుండా 'ప్లీజ్‌ మేడమ్‌.. ఈ పాత్రకు నో చెప్పవద్దు' అని బతిమాలాడు. కథ విన్న తర్వాత నా పాత్ర అద్భుతం అనిపించింది. ఇక ఈ చిత్రంలో నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌ చూసి ఎంతో ఆనందంగా ఉంది. పవన్‌ తక్కువ మాట్లాడుతాడు. ఆయనతో పనిచేయడం అద్భుతం అని చెప్పుకొచ్చింది ఖుష్బూ. 

Kushboo Effect On Agnathavasi Movie:

Kushboo Re Entry  Film Agnathavasi in Troubles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ