పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి క్రిటిక్ కత్తి మహేష్ కి మధ్యన అగ్గిపుల్లవేస్తే భగ్గుమనేలా ఉంది ప్రస్తుత వాతావరణం. కత్తి కనబడితే కొట్టడానికి మాత్రమే కాదు చంపెయ్యడానికి కూడా పవన్ ఫ్యాన్స్ రెడీ. అలాగే చిన్న చితక విషయాలతో కూడా పవన్ కళ్యాణ్ ని ఉతికి ఆరేస్తున్నాడు కత్తి మహేష్. అలాగే కత్తి మహేష్ కేవలం పవన్ ఫ్యాన్స్ ని మాత్రమే కెలకలేదు. బాలయ్య ఫ్యాన్స్ ని కూడా కెలుకుతున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ అభిమానుల మీద చెయ్యి చేసుకోవడం కరెక్ట్ కాదని అన్న కత్తి మహేష్ కి ఇప్పుడు బాలయ్యని ఇరికించే మరో ప్లాన్ దొరికేసింది.
సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాలకృష్ణ 102 వ చిత్రం 'జై సింహా' బెనిఫిట్ షోని వీక్షించిన కత్తి మహేష్..... 80 ల కథకి, 90 ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగూరగంప సినిమా ''జై సింహా''. నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా అంటూ కత్తి మహేష్ 'జై సింహా' ని కత్తికో కండగా కోసి వదిలేశాడు.
మరి ఇంతఘాటైన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ని బాలయ్య ఫ్యాన్స్ ఏం చేస్తారో. రోజుకో రకమైన ఇష్యుతో పబ్లిసిటీ పెంచుకుంటున్న కత్తి మహేష్ కి ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ తోపాటు... బాలయ్య ఫ్యాన్స్ కూడా శత్రువులయ్యారు. మరి పవన్ ఫ్యాన్స్ ని కంట్రోల్ చెయ్యలేని పవన్ ని వచ్చి క్షమాపణ అడగమన్న కత్తి మహేష్.... బాలయ్య ఫ్యాన్స్ తో కూడా విసిగివేశారాక బాలకృష్ణని కూడా క్షమాపణ చెప్పమంటాడేమో చూద్దాం. ఒకవేళ బాలయ్యని క్షమాపణ చెప్పమని కత్తి అడిగాడే అనుకోండి బాలయ్య ఎక్కడో అక్కడ చూసి కత్తి మహేష్ గూబ గుయ్యమనిపిస్తాడు అప్పుడు వదులుతుంది తుప్పు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.