ముందు నుండి అనుకున్నట్టే పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' మొదటి రోజు వసూళ్ళతో తన రేంజ్ చూపించాడు. అసలు అగ్ని పరీక్ష ఇక ముందు ఉంది. విడుదల అయిన మొదటి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ నెగెటివ్ టాక్ అజ్ఞాతవాసి సినిమాపై ప్రభావం చూపిస్తుంది.
ముఖ్యంగా దీని ప్రభావం నైజాంపై తీవ్రంగా వుండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో దీని మీద దాదాపు 29 కోట్ల పెట్టుబడి కేవలం ధియేట్రికల్ రైట్స్ కోసమే దిల్ రాజు పెట్టుబడిగా పెట్టాడు. ఆ లెక్కన మొదటి రోజు తెలంగాణాలో 5.5 కోట్లు షేర్ ని చూసుకుంటే ఇంకా చాలానే రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో రిటర్న్స్ కష్టమే అని తెలుస్తుంది.
ఇక సీడెడ్ సైతం కూడా ఈ సినిమా కేవలం 3 కోట్ల 40 షేర్ మాత్రమే వచ్చిందని సమాచారం. సీడెడ్ లో 16 కోట్లు అమ్మినట్లు సమాచారం. ఇప్పుడే దీని గురించి కంక్లూజన్ కు రాలేము కానీ మరో ఐదు రోజులు ఆగాక పూర్తి క్లారిటీ వస్తుంది. అయితే అజ్ఞాతవాసి అత్యధిక స్క్రీన్స్ లో విడుదల చేసినందుకే ఈ మాత్రం రికార్డు సాధ్యమైందని అంటున్న వారు లేకపోలేదు.