Advertisementt

వెంకీ సీన్స్ కలపడం లేదా..?

Fri 12th Jan 2018 09:47 PM
venkatesh,agnathavasi,pawan kalyan,trivikram srinivas  వెంకీ సీన్స్ కలపడం లేదా..?
No Venky Scenes in Agnathavasi వెంకీ సీన్స్ కలపడం లేదా..?
Advertisement
Ads by CJ

'అజ్ఞాతవాసి' సినిమాలో వెంకటేష్ అతిధి పాత్రలో నటించాడు అనే విషయం గత డిసెంబర్ నుండి మీడియాలో ఒక రేంజ్ లో చక్కర్లు కొట్టింది. అజ్ఞాతవాసిలో వెంకీ దాదాపు నాలుగు నిముషాలు కనబడతాడని.. ఇక ఆ నాలుగు నిమిషాల షూటింగ్ ని కేవలం రెండే రోజుల్లో పూర్తి చేసాడని అన్నారు. ఇక అజ్ఞాతవాసి సినిమా ఈ 10 న బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ కార్డ్స్ లో వెంకటేష్ కి కృతజ్ఞతలు కూడా తెలిపారు. మరి వెంకీ కి పవన్ కి మాత్రమే కాకుండా...  త్రివిక్రమ్ కి వెంకీకి కూడా మంచి సంబంధాలు ఉండడంతో ఈసినిమాలో వెంకీ అతిధి పాత్ర చేశాడనేది వాస్తవం.

అయితే సినిమా చూస్తున్నంతసేపు వెంకటేష్ ఎప్పుడు కనబడతాడా... అని ప్రేక్షకులు వెర్రిమొహాలు వేసుకుని చూస్తోనే ఉన్నా.. వెంకీ దర్శనం మాత్రం అజ్ఞాతవాసిలో కనబడలేదు సరికదా... సినిమా టైటిల్ కి తగ్గట్టే వెంకీ అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఏదో ఫస్ట్ వీక్ లో అజ్ఞాతవాసి హిట్ అవుతుంది.. కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.... ఇక రెండో వారంలో వెంకీ సీన్స్ యాడ్ చేస్తే సినిమాకి మరింత క్రేజ్ వచ్చి కలెక్షన్స్ పెరుగుతాయని త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. కానీ రివర్స్ లో అజ్ఞాతవాసి సినిమా టాక్ ఉంది. త్రివిక్రమ్ ఈ సినిమాని ఎందుకు తీసాడా అని పవన్ ఫాన్స్ కూడా తిడుతున్నారు అంటే సినిమా ఫలితం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇకపోతే సినిమా దారుణమైన ఫలితాన్ని చూశాక ఇప్పుడు వెంకీతో తీసిన సీన్స్ ని మళ్ళీ యాడ్ చేస్తే... అవమానంగా ఉంటుందని చిత్ర బృందం భావిస్తున్నారని టాక్ వినబడుతుంది. ఏ సీన్స్ కలిపినా ఇప్పుడు అజ్ఞాతవాసి గురించి వచ్చిన టాక్ తో మళ్ళీ సినిమాకి కలెక్షన్స్ పెరిగే అవకాశం మాత్రం ఉండదు. ఎందుకంటే ఏదో ఇంట్రెస్టింగ్ సీన్స్ కలిపారని మిగతా సినిమాని మొత్తం భరిస్తూ మూడు గంటలు కూర్చోవడం అంటే ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో.. అందుకే ఇప్పుడు వెంకీ సీన్స్ ని కలపడం ఎందుకులే అనుకుంటున్నారట. మరి ఒక సీనియర్ స్టార్ ని ఒక సినిమాలో అతిధి పాత్రకి తీసుకుని ఇలా ఆ సీన్స్ ని ఇప్పుడు సినిమాలో పెట్టకుండా ఆ హీరోని అవమానించినట్లేగా.. మరి  ఈలెక్కన దర్శకుడు త్రివిక్రమ్ హీరో వెంకటేష్ ని అవమాన పరుస్తాడో లేదంటే ఏదైతే అది అయింది అంటూ సీన్స్ యాడ్ చేస్తాడో చూద్దాం.

No Venky Scenes in Agnathavasi:

Doubts on Agnathavasi Venkatesh Scenes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ