జీవితంలో అన్ని విజయాలే వస్తే వాటి కిక్కు ఎవరికీ తెలియదు. పరాజయాలు వస్తేనే విజయాల ఆనందం మనిషికి తెలుస్తుంది. అలాగే ఎందుకు పరాజయాలు వచ్చాయి? వాటి సమయంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు? వాటిని అధిగమించడం ఎలా? అనేది కూడా పరాజయాలు నేర్పే పాఠాలే. అదే విషయం గురించి తాజాగా సమంత స్పందించింది. ఈమె ఎందరో టాప్ స్టార్స్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించింది. పరాజయాలు కూడా పలకరించాయి. అయితే తన మీద నమ్మకంతోనే దర్శకనిర్మాతలు తనని తీసుకునే వారని, ఇక జయపజాయలు గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, తన పాత్రకు తను న్యాయం చేసిందా? లేదా? అనేదే తనకు ముఖ్యం అని సమంత తెలిపింది.
ఇక విజయాలు వచ్చినప్పుడు చుట్టూ వాతావరణం ఎంతో సందడిగా ఉంటుంది. అదే పరాజయాలు వస్తే అంతా నిస్తేజంగా ఉంటుంది. అయితే ఫ్లాప్‌ల సమయంలో నాకు వచ్చిన అనుభవాలకు మాత్రం నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. చుట్టు ఉండే వారు విజయాలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? పరాజయం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనేది తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎలా ఎక్కాలో నేర్చుకున్నాను. ఒక్కో సంఘటన, దాని అనుభవం, ఇతరుల ప్రవర్తన చూసి నన్ను నేనే నేర్చుకుంటూ వస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇంతేనని చెప్పింది.
ఇక ఈమె నేడు ప్రముఖ సినీ ఫ్యామిలీ అక్కినేని ఇంటికి కోడలైంది. ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్ సరసన 'రంగస్థలం', 'మహానటి'లో జమున పాత్రలతో పాటు తమిళంలో రెండు చిత్రాలలో నటిస్తోంది. ఇవి కూడా తమిళ్ లో విడుదల కానున్నాయి.