సాధారణంగా నాటి హీరోలు మిగిలిన చిన్న చిన్న వేషాలు వేసేవారితో, బిగ్రేడ్ ఆర్టిస్టులతో, జూనియర్ ఆర్టిస్టులతో అసలు కలిసేవారే కాదు. తమకంటూ ఓ స్థాయి ఉందని చెప్పి తమ సమ ఉజ్జీవులు, తమ తోటి హీరోయిన్లు, దర్శకనిర్మాతలతో మాత్రమే మాట్లాడేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం మన హీరోలు అందరితో ఎంతో కలివిడిగా ఉంటూ తాము డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీలమని నిరూపించుకుంటున్నారు. బాలకృష్ణ వంటి వారు కూడా షూటింగ్స్‌లో అదే విధంగా ఉంటారని అంటారు. ఇక తాజాగా రామ్‌చరణ్ తాను కూడా ఈ విషయంలో మేటి అని నిరూపించుకున్నాడు.
ఆయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. సుకుమార్ వైవిధ్యభరితమైన చిత్రాలు తీస్తాడనే పేరు ఉండటం, చిత్రం బ్యాక్‌డ్రాప్ కూడా పల్లెటూరి నేపద్యంలో అందునా 1985 కాలం నాటి పీరియాడికల్ మూవీ కావడం, ఇందులోని రామ్‌చరణ్, సమంతల లుక్‌లు షాకింగ్‌గా ఉండటంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం షూటింగ్‌లో జబర్దస్ టీంపై కొన్ని కామెడీ సీన్స్‌ని చిత్రీకరించారు.
ఈ సందర్భంగా కమెడియన్ మహేష్ గురించి రామ్‌చరణ్ సరదాగా ఓ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కమెడియన్ మహేష్ ఈ చిత్రం కోసం తీసిన ఓ షూట్‌లో టేక్‌లకు టేక్‌లు తినేశాడని చెప్పాడు. 'చిత్ర యూనిట్ సుదీర్గంగా పనిచేసింది. రాత్రి మహేష్‌పై తీసిన సీన్‌కి టేక్‌లకు టేకులు తినేశాడు. దాంతో అందరం అక్కడే ఉండిపోయాం' అని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.