టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'అజ్ఞాతవాసి'. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బేస్..త్రివిక్రమ్ డైరెక్షన్ పై వున్న అంచనాలతో ఈ సినిమా విడుదల అయింది. రిలీజ్ అయినా మార్నింగ్ షో నుండే ఈ సినిమాకి మిశ్రమ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్' అనే సినిమా నుండి కాపీ కొట్టి తీసారని టాక్ కూడా ఉంది.
'అజ్ఞాతవాసి' కాపీ ఆరోపణలు లార్గో వించ్ ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ సల్లే దాకా కూడా వెళ్లాయి. 'అజ్ఞాతవాసి' సినిమాను ఆయనే స్వయంగా చూడటంతో పాటు ఓ ట్వీట్ కూడా పెట్టాడు. ‘‘టి-సిరీస్ తో చేసుకున్న సెటిల్మెంట్ సరిపోదేమో అని నేను భయపడుతున్నాను. ఇది కేవలం ఇండియాకు సంబంధించిన విషయం కాదు. అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది’’ అని ట్వీట్ చేసారు.
పోని లార్గో వించ్ అక్కడ హిట్టా అనుకుంటే ఫట్టే అయింది. ఇప్పుడు దాదాపుగా అదే స్టోరీ ఎత్తేశారు అంటున్న అజ్ఞాతవాసి కూడా అదే టాక్ మూటగట్టుకుంది.