Advertisementt

'అజ్ఞాతవాసి'పై నలుగురు నాలుగు రకాలుగా!

Thu 11th Jan 2018 07:43 PM
agnathavasi,hyper aadhi,pawan kalyan,kathi mahesh  'అజ్ఞాతవాసి'పై నలుగురు నాలుగు రకాలుగా!
Kathi Mahesh and Hyper Aadhi Response About Agnathavasi 'అజ్ఞాతవాసి'పై నలుగురు నాలుగు రకాలుగా!
Advertisement
Ads by CJ

మొత్తానికి పవన్‌కళ్యాణ్‌ 'అజ్ఞాతవాసి' ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ మద్య విడుదలైంది. కానీ ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. సినిమా విమర్శకులు ముక్తకంఠంతో ఈ చిత్రం బాగాలేదని చెబుతున్నారు. మరోవైపు కత్తి మహేష్‌-పవన్‌ ఫ్యాన్స్‌కి మధ్య జరుగుతున్న వార్‌ నేపధ్యంలో ఈ చిత్రం గురించి కత్తిమహేష్‌ ఇచ్చే రివ్యూపై పలువురు ఆసక్తిగా ఎదురు చూశారు. 

ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని చూసిన కత్తిమహేష్‌ మాట్లాడుతూ, పవన్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'జల్సా, అత్తారింటికిదారేది' చిత్రాలతో పోల్చుకుంటే ఈ చిత్రం చెత్తగా ఉందని కామెంట్‌ చేశాడు. సీరియస్‌ కథకి మధ్యలో చొప్పించిన కామెడీ చికాకును కలిగించిందని ఆయన అన్నారు. పవన్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చెత్త చిత్రం ఇది అని చెబుతూ, ఈ చిత్రంలోని పాటకి తగ్గట్టుగా రిస్క్‌ చేసి చూస్తే టైమేమో.. అంటూ తనదైన శైలిలో కౌంటర్‌ వేశాడు. కానీ పవన్‌ అభిమానులు మాత్రం ఈ చిత్రం చాలా బాగుందని అంటున్నారు. 

ఈ చిత్రాన్ని చూసిన హైపర్‌ ఆది మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పవన్‌ కోసం పదిసార్లు చూడవచ్చు. త్రివిక్రమ్‌ కోసమైతే మూడు సార్లు చూడవచ్చు. మిగిలిన ఆర్టిస్ట్‌ల కోసమైతే వీలున్నప్పుడల్లా చూడవచ్చు అని అంటున్నాడు. ఈ చిత్రంలో బొమ్మన్‌ ఇరాని చెప్పిన 'రాజ్యం మీద ఆశలేనోడికంటే గొప్పరాజు ఎవడుంటారు?' అనే డైలాగ్‌ తనకి బాగా నచ్చిందని ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అంటున్నాడు. 

కానీ మొదటి నుంచి త్రివిక్రమ్‌ శైలి ఎలా ఉంటుందంటే ముందు ఓ డైలాగ్‌ అనుకుని దానికి తగ్గట్లుగా ఆయన సీన్స్‌ని రాసుకుంటాడనే విమర్శ ఉంది. ఈ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుందని అంటున్నారు. మొత్తానికి ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో లేదని మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు. 

Kathi Mahesh and Hyper Aadhi Response About Agnathavasi:

Agnathavasi got Mixed Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ