Advertisementt

అజ్ఞాతవాసిపై నెగెటివ్ ప్రచారమా? పాజిటివ్ ప్రచారమా?

Thu 11th Jan 2018 12:51 AM
pawan kalyan,agnyaathavaasi,agnyaathavaasi review,hit or flop  అజ్ఞాతవాసిపై నెగెటివ్ ప్రచారమా? పాజిటివ్ ప్రచారమా?
Agnyaathavaasi Hit or Flop అజ్ఞాతవాసిపై నెగెటివ్ ప్రచారమా? పాజిటివ్ ప్రచారమా?
Advertisement
Ads by CJ

అజ్ఞాతవాసి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. పవన్ - త్రివిక్రం కాంబోలో ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏపీలో ప్రీమియర్ షోస్ తో ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. అయితే సినిమా విడుదలైన కొన్ని గంటల్లోన్నే సినిమా హిట్టా  ఫట్టా... అంటూ ఒక ఛానల్ హెడ్ లైన్స్ తో తెగ ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే ఆ ఛానల్ కి అజ్ఞాతవాసి ఆడియో రైట్స్ దక్కని కారణంగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిపై నెగెటివ్ ప్రచారానికి పూనుకుందని రూమర్ ఉంది. 

ఇప్పుడు అది నిజమే అన్నట్టుగా ఆ ఛానల్ వారు అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ దగ్గర అభిమానుల హడావుడిని టెలికాస్ట్ చేస్తూ అజ్ఞాతవాసి సినిమా థియేటర్స్ లో దూసుకుపోతోందని... చెబుతూనే... ఈ సినిమాకి ఏ వెబ్ సైట్ ఎంత రేటింగ్ ఇచ్చింది, అలాగే ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏమిటి? మైనస్ పాయింట్స్ ఏమిటి అనే విషయాన్ని హైలెట్ చేస్తూ అజ్ఞాతవాసి అప్ డేట్స్ ని ప్రచారం చేస్తుంది. ఒకసారి పాజిటివ్ గా చెబుతున్న ఆ ఛానల్ వారు మరోసారి నెగెటివ్ కామెంట్స్ ఈ సినిమాకి వస్తున్నాయంటూ చెప్పడం అనేది చూస్తుంటే అజ్ఞాతవాసికి ఆ ఛానల్ నెగెటివ్ ప్రచారం చేస్తుందా... లేదా పాజిటివ్ ప్రచారం చేస్తుందో అర్ధం కాక ప్రేక్షకులతో పాటు పవన్ ఫాన్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు.

Agnyaathavaasi Hit or Flop:

Agnyaathavaasi Hit or Flop

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ