ఇటీవలే ఓకే స్టేజీ మీద నుంచి ఉప్పునిప్పులా ఉండే ధనుష్, శింబులు తామిద్దరం ఎంతో సన్నిహితులమని, కాబట్టి అభిమానులు తమ వైరం మానుకోవాలని, గొడవలు చేసే ఫ్యాన్స్ తమకు అవసరం లేదని చెప్పారు. ఇక ఇలాగే రజనీకాంత్-కమల్‌హాసన్, అజిత్-విజయ్ వంటి వారు కూడా పలు సార్లు అభిమానులకు విజ్ఞప్తులు చేశారు. మమ్ముట్టి-మోహన్‌లాల్ లు కూడా తామెంతో ఫ్రెండ్స్‌మని, ఇతర హీరోలపై కామెంట్లు చేసేందుకు తామేమీ ఎవ్వరినీ నియమించుకోలేదని, కాబట్టి వాటికి అభిమానులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇక తాజాగా తెలుగు విషయానికి వస్తే ఎంతో కాలంగా మెగాఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ఉప్పులో నిప్పులా ఉంటారు. గతంలో ఎన్టీఆర్-ఏయన్నార్, ఎన్టీఆర్ - కృష్ణ తరహాలనే తర్వాత చిరంజీవి-బాలయ్యల మధ్య పోరు నడిచింది. వీరు ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లేవారు. ఇప్పుడు మాత్రం మెగాహీరోలు-నందమూరి హీరోల మధ్య బాగా సత్సంబంధాలు పెరిగాయి.
గతంలో బాలయ్య మాట్లాడుతూ, ఇండస్ట్రీలో తనకున్న ఒకే ఒక్క మిత్రుడు చిరంజీవి అని చెప్పాడు. ఇక ఇద్దరి ప్రైవేట్ వేడుకల్లో ఒకరికొకరు స్టేజీలపై డ్యాన్స్‌లు కూడా చేసుకున్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ రానుంది. రామ్‌చరణ్-బోయపాటి చిత్రంలో నందూమూరి తారకరత్న నటిస్తున్నాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల మూవీకి పవన్ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఆమధ్య పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవలో ఓ అభిమాని కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక పవన్ ప్రస్తుతం టిడిపికి మద్దతు ఇస్తున్నాడు.
ఇలాంటి సమయంలో 'అజ్ఞాతవాసి' రిలీజ్ సందర్భంగా గుంటూరు జిల్లాలోని మాచెర్లలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకే ఫ్లెక్సీపై పవన్, ఎన్టీఆర్‌ల ఫొటోలను ముద్రించి, ఆల్‌ది బెస్ట్ టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. అంటూ ఇట్లు టౌన్ వైడ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని తెలిపారు. మరి పవన్ అభిమనులు కూడా బాలయ్య 'జైసింహా'కి ఫ్లెక్సీలు కడతారేమో చూడాలి.. మెత్తానికి మిగిలిన అందరు అభిమానులకు మాచెర్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆదర్శంగా నిలుస్తున్నారనే ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమాని సినిమాగా చూసే కాలం రాబోయేరోజుల్లో అయినా వస్తుందనే ఆశ మొలకెత్తుతోందని చెప్పాలి.