బాలీవుడ్‌లో బాలనటిగా చేసి, తర్వాత తెలుగులోకి వెంకటేష్ హీరోగా పరిచయమైన 'కలియుగపాండవులు' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన భామ ఖుష్బూ. తర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా ఆమె తమిళంలో మరో బొద్దుబాబు ప్రభుతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. వీరిద్దరు పలు చిత్రాలలో కలిసి నటించారు. అదే సమయంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'చిన్నతంబీ' చిత్రం ఓ సంచలనం, ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె ముస్లిం కావడంతోనే శివాజీగణేషన్ వారి పెళ్లికి బ్రేక్ లేశాడని నాడు వార్తలు వచ్చేవి. ఇక తమిళనాడులో ఈమె బొద్దు అందాలకు తమిళ తంబీలు మైమరిచిపోయారు. ఆమెకి ఏకంగా ఓ గుడిని కట్టి, ఏపీలో చిరంజీవి దోశ తరహాలో తమిళనాడులో ఖుష్బూ ఇడ్లీలు బాగా ఫేమస్ అయ్యాయి.
ఇక సుందర్‌సిని వివాహం చేసుకుని సపోర్టింగ్ రోల్స్, వివాదాస్పద కామెంట్స్‌తో ఆమె ఎప్పుడు వార్తల్లో నిలిచే ఉంటుంది. అమ్మాయిలు పెళ్లికాకుండానే గర్బవతులైతే తప్పేంటి? కండోమ్‌ను పెళ్లికి ముందు సెక్స్‌లో వాడండి.. అని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మరోవైపు ఆమె రాజకీయనాయకురాలి అవతారం కూడా ఎత్తింది. ఇటీవలే ఆమె ముస్లిం అని సోషల్‌మీడియాలో వస్తున్న కౌంటర్లకు ఘాటుగా సమాధానం చెప్పింది. మరోవైపు ఆమె మెగాస్టార్ నటించగా, మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్టాలిన్' చిత్రంలో నటించింది.
దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత ఆమె మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్‌కళ్యాణ్ ల కాంబినేషన్‌లో వస్తున్న 'అజ్ఞాతవాసి'లో కీలకమైన పాత్రను చేస్తోంది. 'అత్తారింటికి దారేది' చిత్రంతో నదియాకి డిమాండ్ తెచ్చిన త్రివిక్రమ్ ఈ చిత్రం ద్వారా ఖుష్బూని కూడా బిజీగా చేస్తాడని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదల సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ ఈ చిత్రం విడుదల ముందు నా పరిస్థితి ఎలా ఉందంటే ఓ చిన్నారి తన మొట్టమొదటి ప్రోగ్రెస్ కార్డ్ కోసం ఎంతగా నిరీక్షిస్తుందో అలా ఉంది. ఇక త్రివిక్రమ్‌గారు నా ఆశలను వమ్ము చేయరు. పవన్‌కళ్యాణ్ గారికి ఎంతో రుణపడి ఉన్నానని ట్వీట్ చేసింది. మొత్తానికి ఈ చిత్రంలో ఆమె పాత్ర, ఆమె నటన మరికొన్ని గంటల్లోనే తేలిపోనున్నాయి. అయితే ఈ ట్వీట్ తో పవన్ ఫ్యాన్స్ యమా ఖుషి అవుతూ.. ఆమెకు థాంక్స్ చెబుతున్నారు.