గత ఏడాది శతమానం భవతి, రాధా, మహానుభావుడు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించిన యంగ్ హీరో శర్వానంద్. శతమానం భవతి, మహానుభావుడు చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సంగతి విదితమే. కాగా ఈ ఏడాది కూడా శర్వానంద్ నుంచి రెండు సినిమాలు విడుదల అవుతాయని అందరూ అనుకుంటున్న తరుణంలో గతంలో కమిట్ అయిన సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం పట్టాలెక్కకుండానే ఆగిపోయిందనే టాక్ ఈ మధ్య జోరుగా వినిపిస్తుంది. అయితే ఈ వార్తని ఖండిస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి కాల్ షీట్స్ ఇచ్చిన శర్వానంద్ ఒకేసారి రెండు చిత్రాల రెగ్యులర్ షూటింగ్స్ హేండిల్ చేయలేకపోవడంతో ముందుగా ప్రకటించిన సమయానికి సుధీర్ వర్మ చిత్రం పట్టాలెక్కలేకపోయింది. అయితే ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ లాక్ చేసుకున్న సుధీర్ వర్మ-శర్వానంద్ లు హను రాఘవపూడి చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే అవకాశం వుంది.