నేటి జనరేషన్ హీరోయిన్లు చాలా జాగ్రత్తగా కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. లైమ్‌లైట్‌లో ఉండగానే పలు అవకాశాలతో పాటు బిజినెస్ టైకూన్లనో, లేక బడా బడా వ్యక్తులనో ముగ్గులోకి దింపి కెరీర్ బిజిగా ఉండగానే ఎప్పుడు ఉంటామో.. ఎప్పుడు ఫేడవుట్ అవుతామో చెప్పలేని సినీ కెరీర్ కంటే బాగా ఉన్నవాడిని చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలనే ప్రయత్నిస్తున్నారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక తెలుగులో వరుసగా 'ఇద్దరు అమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు' చిత్రాలతో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ సరసన జత కట్టిన అమ్మడు కేథరిన్. ఈమె కూడా అమలాపాల్ రూటులో నడుస్తోందా? అనే అనుమానాలకు తావిచ్చేలా తాజాగా మాట్లాడింది.
ఈమెకి తెలుగులో మెయిన్ హీరోయిన్‌గా కాకపోయిన ఏవో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈమె కోలీవుడ్‌పై కన్నేసినా కూడా అక్కడ మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈమె విశాల్‌తో కలిసి 'కథకలి' చిత్రంలో నటించింది. గ్లామర్ డోస్ ఏ స్థాయిలో పెంచడానికి సిద్దంగా ఉన్నా కూడా ఈమెని పట్టించుకోకపోవడం బాధాకరమే. ఆమె హీరోయిన్‌గా ఆర్యతో జతకట్టిన 'కదంబన్' చిత్రం తర్వాత తమిళంలో కనిపించలేదు. తాజాగా ఆమె సుందర్ సి. దర్శకత్వంలో 'కలగలప్పు 2' 'కథానాయగన్' చిత్రాలలో నటిస్తోంది. 'కలగలప్పు 2'లో ఆమె రెచ్చిపోయి నటించిందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అందరు హీరోయిన్లుగానే తనకు చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉందని తెలిపింది.
ఇక గ్లామర్‌షోకి తాను రెడీనే అని హింట్ ఇచ్చింది. హీరోయిన్‌గా కాకపోయినా లవర్ పాత్రల్లో గ్లామరస్‌గా నటించడానికి కూడా తనకు ఏ అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చింది. మరి హీరోలకి వదిన, అక్క వంటి పాత్రలు వస్తే నిక్కచ్చిగా నో చెబుతానంటోంది. క్యారెక్టర్ రోల్స్ చేస్తారా? అంటే తనకు ఇంకా ఆ వయసు రాలేదని గడుసుగా సమాధానమచ్చింది. పనిలో పనిగా తనకు 'సరైనోడు' జోడీగా ఇప్పటివరకు దొరకలేదని, అలాంటి వ్యక్తి కనిపిస్తే అప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలా? లేక వివాహం చేసుకుని ప్రేమించాలా? అనేది తేల్చుకుంటాడనని చెప్పింది. మొత్తానికి ఈ అమ్మడికి ఇప్పుటికే పెళ్లి వైపు మనసు మళ్లిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ అమ్మడు ఎవరిని బుట్టలో వేస్తుందో వేచిచూడాల్సివుంది...!