ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ ఫ్యాన్స్ - కత్తి మహేష్ మధ్య హాట్ కామెంట్స్ వల్ల సోషల్ మీడియా చాలా హాట్ గా మారింది. కత్తి మహేష్ పై పవన్ ఫ్యాన్సే కాకుండా..రైటర్ కోన వెంటక్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ఉన్నట్టుండి కోన ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి దాదాపు 40 నిమిషాలకు పైగా మాట్లాడడం హాట్ న్యూస్ గా మారింది. ఎన్నడూ లేనిదీ కోన వెంకట్ ఇలా ప్రత్యేకంగా వీడియో రూపంలో కలుసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
పవన్ మౌనాన్ని, మంచితనాన్ని కొందరు అలుసుగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇది మంచిది కాదు అన్న కోన ఆయన మూడో కన్ను తెరిచే దాకా తెస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పవన్ ధ్యానం చేయటం వల్ల సాత్వికంగా మారారని, దాన్నే అవకాశంగా తీసుకుంటున్న వాళ్ళకు కాలమే బుద్ధి చెబుతుందని అన్నారు. పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే వాళ్లకే మంచిది కాదని కోన అన్నారు.
అజ్ఞాతవాసి విడుదల మరో రోజుల్లో ఉండగా కోన వెంకట్ ఇలా ప్రత్యేకంగా మాట్లాడ్డం వెనుక కారణం కేవలం పవన్ పేరు మీద జరుగుతున్న రచ్చను చూడలేకే అని కోన సన్నిహితులు అంటున్నారు. అయితే నిన్న ఆదివారం కత్తి మహేష్ చేసిన హల్చల్ తర్వాత మళ్ళీ కోన వెంకట్ పవన్ ఫ్యాన్స్ తో పాటు కత్తి మహేష్ కూడా ఈ నెల 15 వరకు సామరస్యంగా ఉండాలని... అటు పవన్ ఫ్యాన్స్ కి ఇటు కత్తి మహేష్ కి కూడా సూచించాడు. మరి ఈనెల 15 ఆ తర్వాత కోన వెంకట్, కత్తి మహేష్ తో యుద్దానికి దిగుతాడా... లేదంటే.. పవన్ ఫ్యాన్స్ విషయంలో కోనా ఏదైనా చేస్తాడో అనేది మాత్రం మాంచి ఇంట్రెస్టింగ్ విషయంగా కనబడుతుంది.