బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ను తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ని డైరెక్టర్ తేజకి అప్పగించాడు. ఇటివలే టీజర్ కోసం ప్రత్యేకంగా షూట్ కూడా నిర్వహించారు. లేటెస్ట్ గా జరిగిన ఇంటర్వ్యూలో బాలయ్య మరిన్ని వివరాలు బయటపెట్టాడు.
ఎన్టీఆర్ బయోపిక్ కోసం రకరకాల గెటప్పుల్లో కనిపించబోతున్నాడట బాలయ్య. దాదాపు 62గెటప్పుల్లో కనిపిస్తాడట. ఎన్టీఆర్ బయోపిక్ ను ఎక్కడనుండి స్టార్ట్ చేస్తారో.. ఎక్కడ ఎండ్ చేస్తారో అనే అంశంపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బాలయ్య క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ పుట్టినప్పట్నుంచి చివరి వరకు అతని చరిత్ర మొత్తాన్ని బయోపిక్ లో చెబుతామంటున్నాడు. అంతేకాదు, ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణాన్ని ఆవిష్కరించేలా బంధువులు, స్నేహితులతో పాటు శత్రువుల ప్రస్తావన కూడా బయోపిక్ లో ఉంటుందంటున్నాడు బాలయ్య.
బాలయ్య చెప్పినట్టు..'చీకటికోణం' అంటే లక్ష్మీపార్వతి గురించి అనుకోవాలేమో..... ఎందుకంటే చంద్రబాబు గురించి చర్చించేంత ధైర్యం చేయలేరు కదా.