Advertisementt

నాగ్, నాని పాత్రలను రివీల్ చేశారు..!!

Mon 08th Jan 2018 05:45 PM
nagarjuna,nani,don,doctor,sriram aditya  నాగ్, నాని పాత్రలను రివీల్ చేశారు..!!
Nagarjuna, Nani Roles Revealed నాగ్, నాని పాత్రలను రివీల్ చేశారు..!!
Advertisement
Ads by CJ

'భలే మంచి రోజు' దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మిస్తున్న సినిమాలో నాగార్జున, నాని కలిసి నటించబోతున్నారని సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యన మల్టీస్టారర్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు చిన్న చితక హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఇలా మల్టిస్టారర్ చిత్రాలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒక భారీ మల్టీస్టారర్ చెయ్యబోతున్నారు. ఆ మల్టిస్టారర్ కి ఎంత క్రేజ్ ఉందో.. ప్రస్తుతం నాని - నాగ్ కలిసి నటించబోయే.. ఈ మల్టీస్టారర్ మీద కూడా అలాంటి క్రేజ్ ఉంది.

ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగార్జున రిటైర్ డాన్ పాత్ర పోషిస్తుంటే... నాని మాత్రం ప్రేమలో ఓడిపోయి....ఆ ప్రేమ గతాన్ని మర్చిపోవడానికి ట్రై చేసే డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం నాగ్.... వర్మ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటే... నాని, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం లో నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమా మార్చ్ లో విడుదల కాగానే నాని.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో పాటే  శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించబోయే ఈ మల్టీస్టారర్ లో కూడా నటిస్తాడట.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కబోయే... ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుందనే సమాచారం ఉంది. మరి నేచురల్ గా నటించే నాని, అలాగే ఇప్పటికి నవ మన్మథుడిగా వెలిగిపోతున్న నాగార్జున కలిసి నటించడం వంటి విషయంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. 

Nagarjuna, Nani Roles Revealed:

Soft Doctor In Connection With Deadly Don

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ