వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజమే. విషయానికి వస్తే రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. ఈ చిత్రంలో ఆయన గ్రామీణ యువకునిగా, గుబ్బురు గడ్డంతో, లుంగీతో కనిపిస్తున్న మాస్ లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా టీజర్ విడుదల కానుందని సమాచారం. అదే సమయంలో రాజమౌళితో కలిసి ఎన్టీఆర్‌తో చేసే మల్టీస్టారర్ లోపు చరణ్ బన్నీకి 'సరైనోడు'తో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. వరుసగా 'ధృవ, రంగస్థలం 1985' తర్వాత మరలా పక్కా మాస్ చిత్రంలో నటించాలని నిర్ణయించుకోవడం చూస్తే రామ్‌చరణ్ మంచి ప్లానింగ్‌తోనే ముందడుగు వేస్తున్న సంగతి అర్ధమవుతోంది. ఇక ఈచిత్రాన్ని కూడా దానయ్య నిర్మిస్తున్నాడు.
'సై..రా' చిత్రానికి ఛాన్స్ ఇవ్వలేకపోయిన సంగీత దర్శకుడు తమన్‌కి, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఛాన్స్ ఇవ్వలేకపోయిన బోయపాటి శ్రీను ఇద్దరికి రామ్‌చరణ్ పెద్ద గిఫ్ట్‌నే అందిస్తున్నాడు. ఇక ఈ పక్కా మాస్ యాక్షన్ చిత్రంలో విలన్లను కూడా హీరోలతో సమానంగా పవర్‌ఫుల్‌గా చూపించే బోయపాటి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్‌ని తీసుకున్నాడు. ఈ చిత్రం గ్యాంగ్ వార్ నేపధ్యంలో సాగుతుందని తెలుస్తోంది. వివేక్ ఓబేరాయ్ గ్యాంగ్‌లో నందమూరి హీరో తారకరత్న కూడా కనిపించనున్నాడు. ఇదే గ్యాంగ్‌లో మరో కీలకమైన పాత్రకి రామ్‌ని ఎంచుకున్నారట. అయితే అతను హీరో రామ్ కాదు. సాక్షి పత్రికలో ఫ్యామిలీ పేజీని చూస్తూ సిఈవోగా ఉన్న ప్రియదర్శి రామ్.
ఈయన 2006లో తానే నటునిగా, నిర్మాత, రచయిత, దర్శకునిగా 'మనోడు' చిత్రం చేశాడు. ఆ తర్వాత రాజా నటించిన 'టాస్' చిత్రంలో నటించి, ఉపేంద్రకి వాయిస్ ఓవర్ చెప్పడమే కాదు.. నీలకంఠ తీసిన 'మిస్సమ్మ' చిత్రంలో కనిపించాడు. మరి ఈ ప్రియదర్శి రామ్ పాత్ర ఈ చిత్రంలో ఎంత కీలకం అనేది త్వరలో తెలియనుంది. మరోవైపు ఈ చిత్రం ఆగిపోయిందనే రూమ్మర్ల మధ్య ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించి, దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు....!