ఫిదా సినిమాతో ఒక్కసారిగా తెలుగులోకి దూసుకొచ్చింది మలయాళ భామ సాయి పల్లవి. అయితే సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకులు కొత్తేమి కాదు. ఎందుకంటే ఈటీవీలో వచ్చిన ఢీ ప్రోగ్రాంలో సాయి పల్లవి డాన్స్ కి బోలెడంత మంది తెలుగు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఢీ ప్రోగ్రాం లో సాయి పల్లవి డాన్స్ మూమెంట్స్ అంత అద్భుతంగా ఉండేవి. అయితే సాయి పల్లవి ఎంత గొప్ప డాన్సర్ అనేది సినిమాల్లో కూడా అంటే మలయాళ ప్రేమమ్ లో కూడా చూశాం. అయితే సాయి పల్లవికి తెలుగు సినిమాల్లో మంచి డాన్స్ చేసే అవకాశం వచ్చినా సరైన కో డాన్సర్ ఆమెకు ఇంతవరకు తగల్లేదు.
ఎందుకంటే ఫిదా సినిమాలో వరుణ్ తో కలిసి నటించిన సాయి పల్లవికి సోలో గా డాన్స్ చేసి మెప్పించే అవకాశం వచ్చింది కానీ... వరుణ్ తో కలిసి డాన్స్ చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే వరుణ్ డాన్స్ లో వీక్. అలాగే సాయి పల్లవి నటించిన ఎంసీఏలో కూడా నానితో కలిసి డాన్స్ చేసే అవకాశం వచ్చింది కానీ... నాని కూడా చెప్పుకోదగిన డాన్సర్ కాదు. కానీ ఆ సినిమాలో నాని పక్కన సాయి పల్లవి మాత్రం స్ప్రింగ్ లాంటి బాడీతో సూపర్ డాన్స్ తో చంపేసింది. మరి సాయి పల్లవి తన డాన్స్ ని నిరూపించుకోవాలనుంటే.... ఎవరైనా స్టార్ హీరో అంటే... ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు తగలాలన్నమాట.
మరి ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తున్న సాయి పల్లవి తన డాన్స్ ని సరిగా ప్రేక్షకులకు చేరవెయ్యాలి అంటే ఎవరో ఒక స్టార్ హీరో పక్కన నటించాల్సిందే. మరి సాయి పల్లవికి ఆ అవకాశం ఎప్పుడొస్తుందో మరి.