Advertisementt

'పద్మావతి' పూర్తిగా ముంచేస్తారంట..!

Sun 07th Jan 2018 09:09 AM
karnisena,again,targets,padmavathi movie  'పద్మావతి' పూర్తిగా ముంచేస్తారంట..!
Padmavati Problems Contiunes.. 'పద్మావతి' పూర్తిగా ముంచేస్తారంట..!
Advertisement
Ads by CJ

గతేడాది మొత్తం సంజయ్‌లీలాభన్సాలీ, దీపికాపడుకోనే ప్రధాన పాత్రలో తీసిన 'పద్మావతి' చిత్రంపై వచ్చిన విమర్శలతో వేడెక్కింది. ఎట్టకేలకు ఈ చిత్రం పేరును 'పద్మావతి' నుంచి 'పద్మావత్‌' గా మార్చి కొన్ని మార్పులు చేర్పులు చేయడం, ఝూమర్‌సాంగ్‌తో పాటే సతీ సహగమనాన్ని హైలైట్‌ చేయవద్దని సెన్సార్‌బోర్డ్‌ ప్యానెల్‌ సూచించిన మేరకు మార్పులు చేర్పులు చేయాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. ఈ మార్పులతో ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్‌ ఇవ్వడానికి సెన్సార్‌బోర్డ్‌ సుముఖంగా ఉందని, దాంతో ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలవుతుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు.

కర్ణిసేన మాత్రం ఈ చిత్రాన్ని పూర్తిగా బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. కర్ణిసేన చీఫ్‌ లోకేంద్రసింగ్‌ కల్వి మాట్లాడుతూ, ఈ చిత్రం విషయంలో దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీకే స్పష్టత లేదు. ఒకసారి ఇది చారిత్రిక సినిమా అంటాడు. మరోసారి కల్పితం అంటాడు. ఓ వీరనారిని ఎందరో ఆరాధ్యదైవమైన పద్మావతిని అలా చూపిస్తే ఒప్పుకునేది లేదు. దీనిపై ప్రాణ త్యాగానికైనా సిద్దం. చట్టం కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ చిత్రం విడుదల కావడానికి ఒప్పుకోం. సెన్సార్‌బోర్డ్‌ ప్రవర్తన కూడా సరిగా లేదు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పాడు.

ఇక కేంద్రంలో ఉన్నది హిందు పక్షపాతి అయిన బిజెపి ప్రభుత్వమే. ఇక కేంద్ర సెన్సార్‌ ప్యానెల్‌ అంటే కేంద్రప్రభుత్వం కనుసన్నలలోనే నడుస్తుంది. దాంతో ఈ చిత్రంలో ఇబ్బందికర సీన్స్‌లేవని భావించిన తర్వాతనే కేంద్రప్రభుత్వ జోక్యంతోనే ఈచిత్రం విడుదలకు అవకాశాలు మెరుగయ్యాయి. కానీ ఇప్పటికీ ఈ చిత్రంపై కర్ణిసేనలో అనుమానాలు పోలేదు. వారు ఈనెల 27న చిత్తోర్‌గడ్‌లో సమావేశం అవుతున్నారు.

మరోవైపు కర్ణిసేన, చరిత్ర కారుల కమిటీకి ఈ చిత్రాన్ని ముందుగా చూపించడానికి సంజయ్‌లీలా భన్సాలీకి ఉన్న అభ్యంతరం ఏమిటో అర్దం కాదు. ఏకంగా మీడియాకు చిత్రం చూపించిన ఆయన కర్ణిసేన నాయకులకు కూడా దీనిని చూపిస్తే అసలు సమస్య అనేది ఉండదు. మరోవైపు గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు పూర్తికావడంతో ఈ చిత్రం విషయంలో బిజెపి కేంద్రప్రభుత్వం కూడా చూసిచూడనట్లుగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. 

Padmavati Problems Contiunes..:

Karnisena Again Targets Padmavati

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ