అజ్ఞాతవాసికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..!
Benefit Shows Granted to Agnathavasiసాధారణంగా తమ సినిమా బాగుంటే ముందు రోజే మీడియా వాళ్ళకి, ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ కి ప్రివ్యూ వేస్తుంటారు నిర్మాతలు. గత ఏడాది లో 'బాహుబలి' , 'అర్జున్ రెడ్డి' సినిమాలకు నిర్మాతలు సాహసం చేసి ముందు రోజు రాత్రి సామాన్య జనాల కోసం కూడా స్పెషల్ షోలు వేసేశారు.
సినిమాపై పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఇలా ముందు రోజే ప్రివ్యూ వెయ్యరు నిర్మాతలు. అయితే ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ విషయంలోనూ అలాగే చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే బుధవారం సినిమా రిలీజవుతుండగా.. ముందు రోజు రాత్రి సెకండ్ షోతోనే ‘అజ్ఞాతవాసి’ ప్రేక్షకుల్ని పలకరిస్తాడట. తెలంగాణలో ముందు రోజు రాత్రి సెకండ్ షోలకు అనుమతి లభించినట్లు సమాచారం. ఆంధ్రాలో అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలుకు అనుమతి వచ్చినట్లు తెలుస్తుంది.
ప్రీమియర్స్ గురించి ఇటీవలే పవన్ కళ్యాణ్.. సీఎం కేసీఆర్ ను కలిసి ముందు రోజు ప్రీమియర్స్ కి అనుమతి తీసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో 90 - 95 శాతం థియేటర్లలో రెండు రోజుల పాటు ‘అజ్ఞాతవాసి’ సినిమానే ఆడబోతోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే 'బాహుబలి 2' కు ధీటుగా కలెక్షన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.
CM KCR Green Signal to Agnathavasi Benefit Shows







































