'హలో' సినిమా టాక్ బావున్నా కలెక్షన్స్ అనుకున్నంతగా లేవు. పెట్టిన పెట్టుబడి కూడా రావటం కష్టమే. మొదటి రోజు నుండి కూడా ఈ సినిమా మంచి టాక్ తో నడిచింది. కానీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ మూడో సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటికి వచ్చింది.
దర్శకుడు సత్య పినిశెట్టితో అఖిల్ తన మూడో సినిమా చేస్తున్నాడని టాక్ వచ్చింది. ఈ డైరెక్టర్ చెప్పిన 2 స్టోరీస్ లో ఒకటి ఫైనలైజ్ చేసి ఈ నెల 10న అధికారికంగా అనౌన్స్ చేద్దాం అనుకున్నాడు అఖిల్. కానీ ఇంతలోనే ఈ వార్త బయటికి వచ్చేసి హల్చల్ చేస్తుంది. డైరెక్టర్ సత్య పినిశెట్టి ఎవరో కాదు, స్వయానా రవిరాజా పినిశెట్టి తనయుడు. నటుడు ఆది పినిశెట్టి తమ్ముడు. సత్య పినిశెట్టి గతంలో తన తమ్ముడిని హీరోగా పెట్టి తీసిన 'మలుపు' అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కి మంచి పేరొచ్చిన విషయం తెలిసిందే.
ఇకపోతే అఖిల్ మూడో సినిమాకు దగ్గుబాటి రానా ప్రొడ్యూసర్ అని కూడా టాక్ వినపడుతుంది. మరి సత్య పినిశెట్టి తీసిన 'మలుపు' వసూలు పరంగా ప్లాప్. అసలే ప్లాప్స్ లో ఉన్న అఖిల్.. ఇలాంటి ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా అనేది తేలాల్సి ఉంది.