Advertisementt

పవన్‌ తన బుల్లి ఫ్యాన్ కి థ్యాంక్స్‌ చెప్పాడు!

Sat 06th Jan 2018 01:12 PM
pawan kalyan,agnathavasi,kodaka song,poland boy,sing,pawan thanks  పవన్‌ తన బుల్లి ఫ్యాన్ కి థ్యాంక్స్‌ చెప్పాడు!
Pawan kalyan says thanks to Poland boy పవన్‌ తన బుల్లి ఫ్యాన్ కి థ్యాంక్స్‌ చెప్పాడు!
Advertisement
Ads by CJ

తెలుగువారికే తెలుగు మాట్లాడటం రావడం లేదు. పాడటం అసలు చేతకావడం లేదు. దాంతో రచయితలు కూడా ఇంగ్లీష్‌ పదాలనే వాడుతున్నారు. కానీ పోలెండ్‌కి చెందిన ఓ బుడతడు మాత్రం అదరగొట్టేస్తున్నాడు. గతంతో 'హలో' చిత్రంలోని 'మెరిసే మెరిసే' పాటను ఆలపించిన ఈ జిబిగ్స్‌ అనే అబ్బాయి నూతన సంవత్సరం కానుకగా పవన్‌ కల్యాణ్‌ 'అజ్ఞాతవాసి'లో సొంతగా పాడిన 'కొడుకా.. కొడకా కోటేశ్వరరావు.. ఖర్సైపోతావురో'.. పాటను పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. పవన్‌ ఫ్యాన్స్‌ దీనిని తెగ షేర్‌ చేసుకున్నారు.

తాజాగా ఇది పవన్‌కళ్యాణ్‌ వరకు చేరింది. ఆయన ఈ వీడియోలోని పాటను చూసి ఆ బుడతడిని అభినందిస్తూ, ఫిదా అయిపోయినట్లు మెసేజ్‌ పెట్టాడు. 'డియర్‌ జిబిగ్స్‌ బుజ్జీ, నా చిన్నస్నేహితుడా.. నీవు ఇచ్చిన నూతన సంవత్సర బహుమతికి కృతజ్ఞతలు. నీ సందేశం నాకు చేరింది. నీకు దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది'.. ఇట్లు పవన్‌కళ్యాణ్‌ అంటూ పీకే క్రియేటివ్‌ వర్క్స్‌ అధికారిక ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలపడమే కాదు.. ఈ కుర్రాడు పాడిన వీడియో లింక్‌ని కూడా పెట్టాడు. ఇక పవన్‌కి కేవలం తెలుగు వారిలోనే కాదు.. పోలెండ్‌లో కూడా ఓ వీరాభిమాని ఉన్న సంగతి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు పవన్‌ మెసేజ్‌కి జిబిగ్స్‌ రిప్లై కూడా ఇచ్చాడు.

తాను ఉబ్బితబ్బియ్యానని, ఈ ఆనందంలో పవన్‌ కోసం ఓ పాట రాస్తానని తెలిపాడు. ఈయన రిప్లై ఇస్తూ 'పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నాకు మెసేజ్‌ పెట్టాడు. థాంక్యూ పవర్‌స్టార్‌. మీ మీద నేను సొంతగా రాసే పాటను జనవరి 9న విడుదల చేస్తాను. ఇది పీఎస్‌ పీకే ఆంథమ్‌...లవ్‌ యూ పవర్‌స్టార్‌' అని రిప్లై ఇచ్చాడు.

Pawan kalyan says thanks to Poland boy:

Poland boy agnathavasi song sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ