'నా పేరు సూర్య' ప్రాజెక్ట్ బన్నీ కన్నా ముందు డైరెక్టర్ వక్కంతం వంశీ ఎన్టీఆర్ కి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త బయటకి వచ్చింది. ఎన్టీఆర్ కోసం ఎప్పటి నుండో వంశీ తయారుచేసి పెట్టుకున్న కథనే బన్నీ కోసం ఇచ్చేశాడు అని.. ఎన్టీఆర్ ఏ విషయమో చెప్పకపోవటం వల్లే ఈ కథను డైరెక్ట్ గా బన్నీకి చెప్పాడని అందరూ అనుకున్నారు.
అయితే దీనిపై వంశీ నుండి మాత్రం ఎటువంటి సమాధానం లేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తరువాత 'నా పేరు సూర్య' ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ బయటకు వచ్చాక మళ్లీ ఎన్టీఆర్ ప్రస్తావన మీడియాలోకి వచ్చింది. ఎన్టీఆర్ మంచి సబ్జెక్టు మిస్ అయినట్లు అని అంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే 'నా పేరు సూర్య' సినిమా కథ కాదంట ఎన్టీఆర్ కి చెప్పింది అది వేరే సబ్జెక్టు అని.. ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అంట. ఆ కథలో ఎన్టీఆర్ ఫుల్ ఫైట్ మోడ్ లో వుంటాడట. ఆ సబ్జెక్టు ఇంకా ట్యూన్ చేయాల్సి వుందని తెలుస్తోంది.
అయితే బన్నీ దగ్గరకి వెళ్ళినప్పుడు.. ఏదైనా డిఫరెంట్ గా కావాలి అంటే ఈ మిలటరీ సబ్జెక్ట్ చెప్తే తీసుకున్నాడట. ఎన్టీఆర్ కు చెప్పిన కథ ఇంకా అలానే వుందంట. ఎన్టీఆర్ ఎప్పుడు ఒకే అంటే అప్పుడు వెళ్లి అది చేయడానికి వక్కంతం రెడీ అంటున్నారు. ఇది ఇలా ఉండగా 'నా పేరు సూర్య' టీజర్ చూసిన ఎన్టీఆర్.. వంశీకి ఫోన్ చేసి టీజర్ చాలా బాగుంది.. బన్నీ బాగా చేశాడు అని అన్నాడంట.