తెలుగు రాష్ట్రాల్లో లో బిగ్ బాస్ ఎంతగా సంచలనం సృష్టించిందో.... బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక ఆ షో కంటెస్టెంట్ మహేష్ కత్తి ఇప్పుడు అంత సంచలనం సృష్టిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తూ సెలబ్రిటీ రేంజ్ కి వెళ్ళిపోయాడు కత్తి మహేష్. బిగ్ బాస్ షో ద్వారా కాస్త ఫేమస్ అయిన కత్తి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. అసలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ని మహేష్ కత్తి ఒక జలగలా పట్టిపీడుతున్నాడు అంటే అతిశయోక్తి కాదేమో....
పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలపై ఎప్పటికప్పుడు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్న కత్తి ఇప్పుడు పవన్ 'అజ్ఞాతవాసి'ని తగులుకున్నాడు. తాజాగా మహేష్ కత్తి 'అజ్ఞాతవాసి' డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా కామెంట్స్ చేస్తున్నాడు. 'అజ్ఞాతవాసి' సినిమా ఒక ఫ్రెంచ్ సినిమాకి కాపీ అని అందరికి తెలిసిన నేపధ్యంలో మహేష్ కత్తి ఈ కామెంట్స్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కత్తి మాట్లాడుతూ.... త్రివిక్రమ్ అనే దర్శకుడు కాపీ చెయ్యకుండా రాసిన, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. కొన్ని సీన్లో, సీక్వెన్సులో, ఏకంగా కథ ఇలా ఏదో ఒకటి కాపీ చేస్తూనే ఉంటాడు. లేదా ఒక డైలాగ్ ఆసక్తికరంగా ఉంటే, దాని చుట్టూ కొన్ని సీన్లు అల్లే ప్రయత్నం చేస్తుంటాడు.
అసలు ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచీ కొన్ని వాక్యాల్ని, ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన పదాల్లో అక్కడక్కడా కూర్చి మాయ చేసి మెప్పిస్తుంటాడు. మన ఖర్మ కొద్దీ ఆ మాత్రం రాసే రచయితలు ఎవరూ లేక అగ్ర దర్శకుడిగా చలామణి అయిపోతున్నాడు..... అంటూ సంచలన కామెంట్స్ చేశాడు కత్తి మహేష్.