Advertisementt

మనవడి కోసమే మూడు షిఫ్ట్‌లు..!!

Thu 04th Jan 2018 09:46 PM
mohan babu,grand son,doing,three shifts,gayatri movie  మనవడి కోసమే మూడు షిఫ్ట్‌లు..!!
Mohan babu About His Grand Son మనవడి కోసమే మూడు షిఫ్ట్‌లు..!!
Advertisement
Ads by CJ

మంచు మోహన్‌బాబు ఎప్పుడో తాత అయిపోయాడు. అయితే జనవరి 1న మంచు ఫ్యామిలీకి చెందిన మూడో తరం వారసుడు ఆయన కుటుంబంలోకి ప్రవేశించండంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఇక తాను తన పిల్లలు పుట్టినప్పుడు రోజూ మూడు షిఫ్ట్‌ల షూటింగ్స్‌లో ఎంతో బిజీగా ఉండే వాడినని, దాంతో తన పిల్లలకు తాను ఎక్కువగా సమయం కేటాయించలేకపోయానని చెబుతున్న మోహన్‌బాబు ప్రస్తుతం మాత్రం తన మూడు షిఫ్ట్‌లు తన మనవడికే కేటాయిస్తున్నానని చెప్పి ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఇక గతంలో వర్మ దర్శకత్వంలో 'రౌడీ' చేసినప్పటికీ మోహన్‌బాబు ప్రస్తుతం మంచు విష్ణు ఇద్దరు కూతుర్ల పేర్లయిన అరియానా, వివియానాల పేర్లతో ఓ బేనర్‌ను స్థాపించి, దానిని శ్రీలక్ష్మీప్రసన్న బేనర్‌కి అసోసియేట్‌ చేసి 'పెళ్లైన కొత్తలో' ఫేమ్‌ మదన్‌తో 'గాయత్రి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తనకు కమ్‌బ్యాక్‌మూవీ అని, నాడు సంచలనం సృష్టించిన 'అసెంబ్లీ రౌడీ' స్థాయిలో ఉంటుందని అంటున్నాడు. దీంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ చిత్రం పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో తండ్రి కూతుర్లు సెంటిమెంట్‌ ప్రధానాంశంగా రూపొందుతోందని సమాచారం. ఇందులో మంచు విష్ణు-శ్రియాశరన్‌లు కూడా కీలకపాత్రలను చేస్తున్నారు. మంచు విష్ణు నటించే పాత్ర చిన్ననాటి మోహన్‌బాబు పాత్ర అని వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి ప్రస్తుతం రాజకీయ నేపద్యం ఉన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ బాగా ఉంటోంది. ఈ నేపధ్యంలో మోహన్‌బాబు 'గాయత్రి' చేస్తుండటం, మంచు విష్ణు 'ఓటర్‌'లో నటిస్తుండటం చూస్తే వారికి ఈ చిత్రాలు కెరీర్‌ పరంగా మంచి హెల్ప్‌ అవుతాయని అంటున్నారు. గతంలో మోహన్‌బాబు నటించిన 'అసెంబ్లీరౌడీ' ఘన విజయం సాధించగా, 'ఎం ధర్మరాజు ఎం.ఎ' చిత్రం గొప్పపేరును తెచ్చుకుని మోహన్‌బాబు నట విశ్వరూపాన్ని చూపించింది. ఆ తర్వాత చేసిన 'పొలిటికల్‌ రౌడీ' పెద్దగా ఆడలేదు. సో.. తన వారసుడు వచ్చిన శుభసందర్భంగా తండ్రీ, తాతలిద్దరి అదృష్టం కలిసి వస్తుందేమో వేచిచూడాల్సివుంది..!

Mohan babu About His Grand Son:

Mohan Babu Is Back Doing Three Shifts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ