Advertisementt

'రంగుల రాట్నం' తో పోటీకి దిగుతున్నాడు!

Thu 04th Jan 2018 07:53 PM
raj tarun,rangula ratnam,sankranthi race,rangula ratnam telugu movie  'రంగుల రాట్నం' తో పోటీకి దిగుతున్నాడు!
Raj Tarun Rangula Ratnam Trailer Released 'రంగుల రాట్నం' తో పోటీకి దిగుతున్నాడు!
Advertisement
Ads by CJ

నిన్నటిదాకా సంక్రాతి బరిలో కేవలం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, తమిళ స్టార్ హీరో సూర్య మాత్రమే ఉన్నారని అందరూ దాదాపు ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ సంక్రాతి రేస్ లోకి మరో మినిమమ్ గ్యారెంటీ హీరో రాజ్ తరుణ్ సైలెంట్ గా దూసుకొచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రెండో చిత్రంలో నటిస్తున్న రాజ్ తరుణ్ తన రంగుల రాట్నాన్ని సంక్రాంతికి ఫిక్స్ చేసెయ్యడమే కాదు పబ్లిసిటీ కార్యక్రమాలను కూడా మొదలెట్టేశాడు. మంగళవారం ఫస్ట్ లుక్ తో సందడి చేసిన రాజ్ తరుణ్.. బుధవారం ట్రైలర్ తో దిగిపోయాడు.

సెల్వరాఘవన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్న 'రంగుల రాట్నం' ట్రైలర్ లో చాలానే ఉన్నాయి. తల్లి చెప్పినా వినని కుర్రోడు.. లవర్ చెప్పగానే వినాల్సిన పరిస్థితిలో ఉంటాడు. రాజ్ తరుణ్ తల్లిగా సితార నటిస్తే లవర్ గా చిత్రా శుక్లా నటించింది. ఇక తల్లి పిలిచి అమ్మాయిని చూడమంటే చూసెయ్యడం.. అలా ఆ అమ్మాయికి దొరకగానే.. అమ్మ చెబితే చూశానని చెప్పడం.. అలాగే తల్లి చెప్పినా పట్టించుకోకుండా గుడికి కూడా వెళ్లని రాజ్ తరుణ్, లవర్ తో బలవంతం గా గుడికి వెళ్లడం ఆ తర్వాత లవర్ తో నువ్వు చెప్పిన పనులేమీ చెయ్యనని చెప్పడం.. మళ్ళీ రియలైజ్ అయ్యి ఆమెకి సారీ చెప్పడం వంటివాటితో రంగుల రాట్నం ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మరి నాగ్ ట్విట్టర్ లో ట్వీట్ చేసినట్టు 'జీవితం రింగు రింగులుగా తిరుగుతూనే ఉంటుంది' అన్నట్టుగానే ఉంది ఈ ట్రైలర్.

ఇకపోతే రాజ్ తరుణ్ ఎప్పటిలాగే... అదరగోట్టేశాడు. ఇక హీరోయిన్ చిత్రా శుక్లా మాత్రం చాలా పద్దతిగల అమ్మాయిలా ఆకట్టుకుంది. మరి నాగార్జున నిర్మిస్తున్న ఈసినిమా కూడా 'ఉయ్యాలా జంపాలా' లా ఒక రేంజ్ హిట్ కొట్టేసేలాగే కనబడుతుంది. ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన శ్రీ చరణ్ బాగానే ఆకట్టుకున్నాడు. మరి ఈ సంక్రాంతికి రాజ్ తరుణ్ ఒక ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ తో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Click Here to see The Trailer

Raj Tarun Rangula Ratnam Trailer Released:

Rangula Ratnam Trailer Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ