Advertisementt

చిరు గడ్డం వెనుక రహాస్యం ఇదే..!

Thu 04th Jan 2018 06:43 PM
chiranjeevi,sye raa narasimha reddy,clean shave,mega star  చిరు గడ్డం వెనుక రహాస్యం ఇదే..!
Mega Star surprises with new look చిరు గడ్డం వెనుక రహాస్యం ఇదే..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి గెడ్డం పెంచినా న్యూసే..తీసినా న్యూసే. టాలీవుడ్ లో ఇప్పుడు చిరంజీవి గెడ్డం తీసిన విషయం డిస్కషన్ పాయింట్ గా మారింది. అసలు గెడ్డం ఎందుకు పెంచారు? కొన్ని రోజుల్లోనే ఎందుకు తీసేసారు అని టాలీవుడ్ లో చాలా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

'సై రా' సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏదొక వార్త బయటికి వచ్చి ఫిలింనగర్ చుట్టూ తిరుగుతుంది. షూటింగ్ స్టార్ట్ చేయకముందు చిరంజీవి.. సురేంద్రరెడ్డిపై నమ్మకం లేక టెస్ట్ షూట్ తీయించాడు. వచ్చిన అవుట్ ఫుట్ చూశాక చిరంజీవి సంతృప్తిగా లేరని, గుణశేఖర్ నో, వివి వినాయక్ నో ప్రాజెక్టులోకి తీసుకోవాలని అనుకుంటున్నారని ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ వట్టిదే అని.. ఫిబ్రవరి నుంచి తరువాతి షెడ్యూలు వుంటుందని సైరా యూనిట్ ప్రకటించింది.

ఇక న్యూ ఇయర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి క్లీన్ షేవ్ తో చకచకా గెడ్డం తీసిన లుక్ తో కనిపించారు. దాంతో మళ్లీ గ్యాసిప్ లు ఊపందుకున్నాయి. క్యారెక్టర్ కంటిన్యుటీ ఉండాలంటే గెడ్డం ఉండాలికదా? మరి ఎందుకు తీసేసినట్టు? మల్లి పెరగాలంటే చాలా టైం పడుతుంది కదా? లేదా టెస్ట్ ఫుటేజ్ చూసుకున్నాక, చిరంజీవి సైరాలో గెటప్ ఏమన్నా మారుస్తున్నారా? ఇలా రకరకాల క్వశ్చన్లు. 

ఎట్టకేలకు ఈ మేటర్ పై మెగా కాంపౌండ్ నుంచి క్లారిటీ వచ్చింది. సినిమాలో గ్రాఫిక్స్ కోసం చిరంజీవిపై ఓ చిన్నపాటి ఫొటోషూట్ చేయబోతున్నారు. చిరంజీవి ముఖ కవలికలు, హావభావాలు రికార్డు చేసి కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తారు. ఇలా చేయడం వల్ల గ్రాఫిక్స్ పనులు వేగవంతం అవుతాయన్నమాట. ఈ షూటింగ్ కు గడ్డం ఉంటే పని జరగదు. అందుకే చిరంజీవి గడ్డం తీసేశారట.

పైగా సైరా సినిమాకు సంబంధించి నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభంకావడానికి ఇంకా నెల రోజులకు పైగా టైం ఉంది. అందుకే చిరంజీవి క్లీన్ షేవ్ లోకి మారిపోయాడు. నెక్ట్స్ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు నయనతార కూడా సెట్స్ పైకి రాబోతోంది.

Mega Star surprises with new look:

Chiranjeevi's Cleanly Shaven Beard Leads Speculations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ