రకుల్ ప్రీత్‌సింగ్... అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన టాప్‌స్టార్ అయింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్ నుంచి నాగచైతన్య, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వరకు అందరితో జత కట్టింది. ఇక ఆమె 'నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకి నాయకా' వంటి హిట్స్ వచ్చినా మహేష్‌తో ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్పైడర్' చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని అందించింది. మహేష్ సరసన నటిస్తుండటం, మురుగదాస్ చిత్రం కావడం, తెలుగు, తమిళ్‌లో ఒకే దెబ్బకు రెండు హిట్టులు కొట్టాలని ఆశపడిన ఈ పంజాబీ భామ ఆ దెబ్బకు విలవిలలాడిపోయింది. మరోవైపు ఆమె హవా కూడా కాస్త తగ్గినట్లు గానే కనిపిస్తోంది.
సాయిపల్లవి, కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్, క్యాధరిన్, మెహ్రీన్, అనుపమ పరమేశ్వరన్, పూజాహెగ్డే వంటి వారి దెబ్బకు అవకాశాలు బాగా తగ్గాయి. ఇక ఈమె తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా నటిస్తోంది. ఇక ఈ పోటీ తట్టుకోవడం కోసం ఆమె నూతన ఏడాదిలో ఇకపై తన చిత్రాలలో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే కీర్తిసురేష్ నుంచి అనుఇమ్మాన్యుయేల్, రాశిఖన్నా వరకు అందరు తెలుగులో ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇక తాను ఎన్ని గంటలు కెమెరా ముందు ఉండమన్నా ఉంటానని, తనకు సినిమాలలోకి రావాలనేది కల కావడం.. ఆ ఫీల్డ్‌లోనే ఉండటం తన అదృష్టమని చెబుతూ, నేను పంజాబీని అయినా తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నానో చూడండి. ఇక కెమెరా ముందు 24 గంటలు ఉండమన్నా ఉంటాను. నాకు కెమెరా ముందు ఉంటే వచ్చే ఆనందమే వేరు అంటూ దర్శకనిర్మాతలకు తాను ఇకపై కాల్షీట్స్ విషయంలోఇబ్బంది పెట్టను అని... సిగ్నల్ ఇస్తోంది.
గతంలో ఆమె మహేష్ బాబు వంటి హీరోకి కూడా కాల్షీట్స్ లేవని చెప్పింది. అదే విషయంలో ఆమె అనేక చిత్రాలు వదులుకుంది. కానీ ఇప్పుడు పోటీ ఎక్కువయ్యే సరికి 24గంటలు కెమెరా ముందు ఉండమన్నా ఉంటానని, స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంటానని ఇన్‌డైరెక్ట్‌గా అందరికీ పచ్చ జెండాను ఊపుతోంది. చూద్దాం.. ఈమెకి కొత్తగా ఏమైనా ఆఫర్స్ వస్తాయో లేదో? ఇక ప్రస్తుతం ఆమె 'అయ్యారీ' అనే బాలీవుడ్ చిత్రంలో సిద్దార్ద్‌మల్హోత్రాతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది.