బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా మహేష్ సోదరుడు రమేష్‌బాబు నిర్మించిన 'అతిథి' చిత్రం ద్వారా మురళీశర్మ తెలుగుకి పరిచయమయ్యాడు. మొదటి చిత్రంతోనే నంది అవార్డును సాధించాడు. ఈయనను చాలా మంది బాలీవుడ్ నటుడు అనుకుంటారు. కానీ ఈయస స్వచ్చమైన తెలుగు వాడు. గుంటూరు ఆయన సొంత ఊరు. ఇక ఆయన పలు బాలీవుడ్ చిత్రాలలో నటించిన తర్వాత 'అతిథి'లో నటించడం గురించి చెబుతూ, ఆ చిత్రం కోసం సురేందర్‌రెడ్డి ఎంతో కష్టపడ్డాడు. నిజానికి నాకు వచ్చిన నంది అవార్డు ఆయనకే చెందుతుంది.
నేను నటుడిని కావాలని చిన్నప్పటి నుంచి కోరిక. ప్రతి సినిమా ఆఫీస్‌కి వెళ్లి ఫొటోలు ఇస్తే అక్కడి వారు నువ్వు నటుడివి కావాలనుకుంటున్నావా? అని ప్రశ్నించేవారు. నేను అవును అని చెబితే వారు నవ్వుతూ, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అని ప్రశ్నించేవారు. దాంతో కన్నీరు పెట్టుకుని, మరలా మరుసటి రోజు మరింత పట్టుదలతో ప్రయత్నించేవాడిని.
ఇక 'అతిథి, కంత్రి' చిత్రాలలో విలన్‌గా నటించిన మీకు 'భలే భలే మగాడివోయ్' చిత్రంలో పాజిటివ్ తండ్రి పాత్ర ఎలా వచ్చింది? అని అందరూ ఆశ్యర్యంగా అడుగుతూ ఉంటారు. నిజానికి ఈ విషయంలో క్రెడిట్ మొత్తం దర్శకుడు మారుతికే చెందుతుంది. ఆయన విజన్‌కి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆ పాత్రకు నేను సూట్ అవుతానని ఆయన ఊహించడం అద్భుతం అని చెప్పుకొచ్చారు.