Advertisementt

'సై రా' కి కృష్ణవంశీ అంట.. ఏం జరుగుతోంది?

Wed 03rd Jan 2018 06:24 PM
chiranjeevi,sye raa movie,songs,krishna vamsi,shooting  'సై రా' కి కృష్ణవంశీ అంట.. ఏం జరుగుతోంది?
Krishna Vamsi To Direct Sye Raa Songs 'సై రా' కి కృష్ణవంశీ అంట.. ఏం జరుగుతోంది?
Advertisement
Ads by CJ

చిరంజీవి ఎంతో ఇష్టపడి... కష్టపడి చేస్తున్న 'సైరా నరసింహరెడ్డి' చిత్రంని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మొదటి షెడ్యూల్ అయితే పూర్తి చేశారు కానీ.... సై రా నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికే మూడు నాలుగు నెలల ఆలస్యంగా షూటింగ్ స్టార్ చేసిన సైరాకు ముందు నుంచి అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయని కేవలం టాక్ మాత్రమే కాదు అందులో నిజాలు లేకపోలేదు. సినిమాటోగ్రాఫర్ మారిపోవడం, సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ సై రా ప్రాజెక్ట్ నుండి ఉన్నట్టుండి తప్పుకోవడం.. అన్నిటికన్నా ఎక్కువగా హీరోయిన్ నయనతార విషయంలో వినిపిస్తున్న గాసిప్స్ తో పాటు.... సెకండ్ హీరోయిన్ వేట ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం లాంటివన్నీ సై రా విషయంలో పలు అనుమానాలు కలిగించే అంశాలుగా కనబడుతున్నాయి.

ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ అనుమానం... సై రా ఫస్ట్ షెడ్యూల్ అవుట్ పుట్ మీద చిరు అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ మాత్రం మెగా అభిమానులను మరింత ఇబ్బంది పెట్టేస్తుంది. ఇక చిరు సై రా షూటింగ్ మీద అసంతృప్తితో... దర్శకుడిగా సురేందర్ రెడ్డి ప్లేస్ లో గుణశేఖర్ ని రమ్మని కబురు పెట్టాడని ఒక మీడియా వర్గంలో న్యూస్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన రెట్టింపు అయ్యింది. అయితే అదంతా కేవలం ట్రాష్ అని కొట్టిపడేసేలా.. దుబాయ్ వెకేషన్ లో ఉన్న రామ్ చరణ్, సై రా దర్శకుడు సురేందర్ రెడ్డిలను చూస్తుంటే అర్ధమవుతుంది. వారిద్దరూ కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సో గుణశేఖర్ ని సై రా కోసం పిలిచారనేది మాత్రం అవాస్తవమే. 

కానీ ఇప్పుడు సై రా విషయంలో మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే... సై రాలో మూడు పాటలు చిత్రీకరించడం కోసం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి పిలుపు వెళ్లిందనే  న్యూస్ ఉంది చూడండి... ఇంకా పెద్ద జోక్ లా కనబడుతుంది. కాకపోతే పాటలను షూట్ చేయటంలో తనదైన ముద్ర వేసే కృష్ణవంశీ అయితేనే ఇంత భారీ కాన్వాస్ ఉన్న మూవీకి న్యాయం చేస్తాడని చిరు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. మరి చిరుతో నిజంగా కృష్ణవంశీ సై రా మూవీ సాంగ్స్ ని షూట్ చేయబోతున్నాడా....అంటే ఏమో మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చేవరకు నమ్మడానికి లేదు. చూద్దాం సై రా విషయంలో ఏం జరగబోతుందో?

Krishna Vamsi To Direct Sye Raa Songs:

Krishna Vamsi In For Sye Raa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ