పవన్‌కి 'గబ్బర్‌సింగ్' ముందు వరకు వరుస పరాజయాలు పలకరించాయి. కానీ 'గబ్బర్‌సింగ్'తో ఆయన తనలోని సత్తాను మరోసారి రుచి చూపించాడు. తన చిత్రం కాస్త బాగున్నా సరే ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తాయో ఈ చిత్రం ద్వారా ఆయన నిరూపించాడు. మరో వైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న 'అజ్ఞాతవాసి' చిత్రం వీరి కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ అనే ప్రచారం జరుగుతోంది. నిజానికి 'అత్తారింటికి దారేది' చిత్రం ముందుగా పైరసీ వచ్చినా కూడా సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. కానీ 'జల్సా' చిత్రం మాత్రం కేవలం సింపుల్ హిట్ మాత్రమే. అదేమీ బ్లాక్‌బస్టర్ కాదు. ఇక ఓవర్‌సీస్‌లో పవన్‌కి ఎంత క్రేజ్ ఉందో దర్శకునిగా, రచయితగా త్రివిక్రమ్‌కి అంతటి ఫాలోయింగ్ ఉంది. పవన్‌తో కాకుండా ఆయన మహేష్‌తో, బన్నీతో, చివరకి నితిన్‌తో చేసిన చిత్రాలు కూడా అక్కడ అద్భుతమైన ఆదరణ పొందాయి.
అలాంటి ఇద్దరు కలిసి ఇప్పుడు సినిమా చేస్తుండటం, మరోవైపు పవన్ 'గోపాల గోపాల' జస్ట్ ఎబౌ యావరేజ్ కావడం, తర్వాత వచ్చిన 'సర్దార్‌గబ్బర్‌సింగ్' డిజాస్టర్ కావడం, ఆ తర్వాత వచ్చిన డబ్బింగ్‌గా తెలుగులో విడుదలైన అజిత్ 'వీరం'కి మరలా రీమేక్‌గా 'కాటమరాయుడు' చిత్రాన్ని పవన్ చేయడం వల్ల ఆయనకు 'అత్తారింటికి దారేది' తర్వాత మరో బ్లాక్‌బస్టర్ రాలేదు. దానిని 'అజ్ఞాతవాసి'తో నెరవేర్చాలని పవన్ భావిస్తున్నాడు. అందునా వచ్చే ఎన్నికల్లో పవన్ బిజీ అయితే మాత్రం వచ్చే ఎన్నికల లోపు విడుదలయ్యే పవన్ చివరి చిత్రం ఇదే అవుతుంది. మరోవైపు ఇది పవన్ 25వ చిత్రం.
ఇప్పటికే టీజర్, ఆడియోలోని ఐదు పాటలతో పాటు కొత్తగా విడుదలైన స్వయంగా పవన్ పాడిన 'కొడకా..కొడకా కోటేశ్వరరావు' మంచి స్పందనను రాబడుతోంది. దీంతో ఈ చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. దీనికి తగ్గట్లుగా ఈ చిత్రం థియేటికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో కూడా ఈ చిత్రానికి టిక్కెట్ల రేట్లను విపరీతంగా పెంచుతారనే వార్తల మధ్య ఈ చిత్రం నైజాం ఏరియా రైట్స్ ఏకంగా 27కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం ఇక పవన్ సినిమా ఫ్లాపయినా కూడా అద్భుతమైన ఓపెనింగ్స్‌లో 50కోట్ల క్లబ్‌లో చేరుతున్న వేళ, ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం నైజాంలో ఇంత భారీ రేటుకు కొన్న బయ్యర్లు రూపాయికి రూపాయి లాభం రాబట్టడం గ్యారంటీ అని అనే నమ్మకం వ్యక్తమవుతోంది.