Advertisementt

వర్మపై సింగర్ గీతామాధురి కూడా వేసిందయ్యో!

Wed 03rd Jan 2018 04:32 PM
geetha madhuri,rgv,ram gopal varma,new year greetings  వర్మపై సింగర్ గీతామాధురి కూడా వేసిందయ్యో!
Singer Geetha Madhuri Punch on RGV వర్మపై సింగర్ గీతామాధురి కూడా వేసిందయ్యో!
Advertisement
Ads by CJ

నిత్యం వివాదాలతో కాలక్షేపం చేసే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. వర్మ అంటే వివాదం. వివాదం అంటే వర్మగా మారిపోయాయి. ఈ రెండు కూడా 'వి' అక్షరంతోనే మొదలవుతాయి. ఇక న్యూఇయర్‌ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, ఊరికినే ఖర్చు లేకుండా విషెష్‌ చెప్పడం, మెసేజ్‌లు ఇవ్వడం శుద్ద దండగ అని, శుభాకాంక్షలు బదులు ఏవైనా విలువైన వస్తువులను గిఫ్ట్‌గా ఇస్తే ఒకే గానీ, ఫ్రీగా వచ్చే విషెష్‌ చెప్పడం ఎందుకు? అని చెప్పి, హ్యాపీ న్యూఇయర్‌ చెప్పని వారందరికీ విషెష్‌ చెప్పి తనదైన శైలిలో కామెంట్‌ చేశాడు. అయితే మరి సరైన ఐడియా తట్టకనో, లేక వర్మతో ఎందుకు అనుకున్నారేమో గానీ వర్మకి మన సెలబ్రిటీలలో ఎవరి నుంచి సరైన ఎటాక్‌ పడలేదు. అయినా ప్రతి విషయాన్ని డబ్బుతో కొలవలేం. తల్లిదండ్రులు పిల్లలిచ్చే ప్రేమని, ఓ నాయకునికి, హీరోకి లేదా వర్మకి అభిమానం పంచే వారి ప్రేమను డబ్బుతో కొలవలేం. ఇక చిరునవ్వు కూడా ఖర్చులేని పనే కదా అని నవ్వకుండా ఉండలేం. ఎవరినీ నవ్వుతో పలకరించలేం. ఇదే పాయింట్‌ని సింగర్‌ గీతా మాధురి క్యాచ్‌ చేసింది. 

ఆమె వర్మకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తూ.. 'నవ్వుతూ బతకడంతో ఖర్చులేదని, తనవరకు ప్రతి రోజు ప్రత్యేకమైనదేనని పేర్కొంది. న్యూఇయర్‌ విషెష్‌ చెప్పడం అంటే ఎదుటి వారిని ప్రోత్సహించడమే..వారిలో అనుకూలతలు, పాజిటివ్‌నెస్‌ని ఎంకరేజ్‌ చేయడమే. పైగా అది ఉచితంగా చేసే పని. డబ్బులు ఖర్చు చేస్తే ఎదుటి వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆశిస్తారు. ఇది తర్వాతి కాలంలో ప్రతికూలంగా మారుతుంది' అని వర్మకి కౌంటర్‌ ఇచ్చింది. 

నిజమే.. దేవులపల్లి కృష్ణశాస్త్రి చెప్పినట్లు 'నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడు నవ్వుతూ చావాలిరా.. చచ్చినాక నవ్వలేవురా.. ఎందరేడ్చినా తిరిగిరావురా' అని పాడుతూ అందరికీ నవ్వులు, శుభాకాంక్షలు చెబుతూ, ప్రోత్సహిస్తూ ఉండటమే నిజమైన తాత్విక వాదం.

Singer Geetha Madhuri Punch on RGV:

Singer Geetha Madhuri Clarity on New Year Greetings

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ