Advertisementt

రామ్ చరణ్ రెండు పక్కా అంటున్నాడు..!!

Wed 03rd Jan 2018 04:11 PM
ram charan,good news,fans,two movies,2018  రామ్ చరణ్  రెండు పక్కా అంటున్నాడు..!!
Ram Charan 2 Movies in 2018 రామ్ చరణ్ రెండు పక్కా అంటున్నాడు..!!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో వస్తున్న రంగస్థలం సినిమా దాదాపు ఒక కొలిక్కి వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా 2 షెడ్యూల్స్ మాత్రమే బాకీ ఉన్నాయట. వాటిలో ఒక షెడ్యూల్ ను రేపట్నుంచే షురూ చేయబోతున్నారు. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ మొదలై..  అది ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత సంక్రాంతికి కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని రాజమండ్రిలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభమౌతుంది అని తెలుస్తుంది. అయితే రాజమండ్రి షెడ్యూల్ లో 2 పాటలు పిక్చరైజ్ చేస్తే.. రంగస్థలం సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే.. అంటున్నారు.

ఇక రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ ఇలా కంప్లీట్ అయిన వెంటనే అలా బోయపాటి సినిమాకు షిఫ్ట్ అవ్వబోతున్నాడు. బోయపాటి - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కబోయే సినిమా ఈనెల 19 నుంచి సెట్స్ పైకి వస్తుంది. అయితే ఆ సినిమా మొదటి షెడ్యూల్ లో చెర్రీ ఉండడట. ఈ నెల 26వ తేదీ వరకు రంగస్థలం షూటింగ్ లో పాల్గొనే చరణ్ ఆ వెంటనే 28 నుంచి బోయపాటి సినిమా సెట్స్ పైకి షిఫ్ట్ అవుతాడు.

ఇకపోతే ప్రస్తుతం రంగస్థలం సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్.. బోయపాటి, చెర్రీ సినిమాకు కూడా మ్యూజిక్ కంపోజర్ గా ఎంపికయ్యాడు. ఇక ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ లేదా... మహేష్ భరత్ అనే నేను సినిమా హీరోయిన్ కై రా అద్వానీని గానీ హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు బోయపాటి. మార్చి 30న రంగస్థలం సినిమా.. దసరాకు బోయపాటి సినిమాల్ని రిలీజ్ చేసి..... ఈ ఏడాది 2 సినిమాలతో ఫ్యాన్స్ ని సంతోష పెట్టాలని రామ్ చరణ్ డిసైడ్ అయ్యాడు.

Ram Charan 2 Movies in 2018:

Good News to Ram Charan Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ