Advertisementt

'అజ్ఞాత‌వాసి' నైజాం దిమ్మతిరిగే రికార్డ్!!

Wed 03rd Jan 2018 02:46 PM
pawan kalyan,agnathavasi,kodaka song,nizam area,record  'అజ్ఞాత‌వాసి' నైజాం దిమ్మతిరిగే రికార్డ్!!
Agnathavasi Nizam Area Record 'అజ్ఞాత‌వాసి' నైజాం దిమ్మతిరిగే రికార్డ్!!
Advertisement
Ads by CJ

అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూ ఇయర్ మరింత జోష్ గా జరుపుకుంటున్నారు. మొన్న ఆదివారం సాయంత్రం 'అజ్ఞాత‌వాసి' సినిమా నుండి ప‌వ‌న్ కళ్యాణ్ పాడిన 'కొడ‌కా....కోటేశ్వ‌ర్ రావు' పాట ప‌వ‌న్ ఫ్యాన్స్ కు స‌రి 'కొత్త' కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ ఒక వైపు.... ఈ సాంగ్ ఒకటి ఒక వైపు అన్నట్టుగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈ సాంగ్ తో సినిమాకు మరింత హైప్ వచ్చింది.

ప్రపంచం వ్యాప్తంగా 'అజ్ఞాత‌వాసి' ఈ నెల 10 న విడుదల అవుతుంది. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కాబట్టి ఈ సినిమా హ‌క్కుల కోసం గ‌ట్టి పోటీ ఏర్ప‌డింద‌ట‌. ఈ చిత్ర నైజాం హ‌క్కులు రికార్డు స్థాయి ధ‌ర ప‌లికిన‌ట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం నైజామ్ రైట్స్ దాదాపు 27 కోట్లకు అమ్ముడైనట్టుగా ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. కేవలం నైజాంలోనే ఈ రేటు ప‌లికితే, ఇక మిగతా ప్రాంతాల్లో హ‌క్కులు, ఓవ‌ర్సీస్, శాటిలైట్, డిజిట‌ల్ రైట్స్ ఏ స్థాయిలో అమ్ముడై ఉంటాయో అని చ‌ర్చించుకుంటున్నార‌ట‌. విడుదలకు ముందు 'అజ్ఞాత‌వాసి' ఇంత హైప్ క్రియేట్ చేస్తే.. విడుదల తర్వాత మ‌రెంత సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో అని ట్రేడ్ వ‌ర్గాలు అనుకుంటున్నారు.

Agnathavasi Nizam Area Record:

Pawan Kalyan Again Shows His Stamina in Nizam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ