2012 లో విడుదలైన సున్నితమైన ప్రేమకథ 'అందాల రాక్షసి' చిత్రంతో వెండితెరకి పరిచయమై ప్రేక్షకులకి చేరువైన లావణ్య త్రిపాఠి తరువాతి కాలంలో 'దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు' వంటి పలు విజయవంతమైన చిత్రాలలో భాగమైంది. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ని అనతి కాలంలో సంపాదించుకుని మీడియం బడ్జెట్ చిత్రాలతో దూసుకుపోతున్న లావణ్య త్రిపాఠికి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది పాపం. గత ఏడాది అమ్మడు నటించిన 'మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒక్కటే జిందగీ' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో పాటు తమిళంలో లావణ్య నటించిన మరో చిత్రంతో ప్రాజెక్ట్ z తెలుగులో నామమాత్రపు గుర్తింపు కూడా పొందలేకపోయింది. దానితో ప్రస్తుతం అమ్మడి చేతిలో వున్న అవకాశాలు చాలా తక్కువ అయిపోయాయి.
హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో పని సాగటంలేదని గ్రహించిందో ఏమో కానీ నూతన సంవత్సర వేడుకలకి బీచ్ ఒడ్డున బికినీతో తలపైకి చేతులు పెట్టుకుని నడుమందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరి కొత్త చిత్ర అవకాశాల కోసం దర్శక నిర్మాతలకి తన గ్లామర్ డోస్ పరిమితులు సడలించుకున్న విషయం తెలపటానికి ఇలా చేసిందని అందరూ ఫిక్సయిపోతున్నారు. మరి లావణ్యకి ఈ ప్రయత్నాలు ఎలా కలిసి వస్తాయో??