Advertisementt

మహేష్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్..!

Wed 03rd Jan 2018 01:04 PM
mahesh babu,bharath ane nenu movie,koratala siva,double role  మహేష్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్..!
Mahesh Double Treat for Fans మహేష్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - కొరటాల శివ 'భరత్ అనే నేను' సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ అదిరిపోతోంది. 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబు రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒక గెటప్ లో ఎన్నారైగా... మరో గెటప్ లో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే ఈ రెండు గెటప్స్ లో ముఖ్యమంత్రి గెటప్ సూపర్ హైలైట్ అంటున్నాడు దర్శకుడు కొరటాల శివ.

మరి సాధారణంగా ముఖ్యమంత్రి అంటే అందరిలో కొన్ని ఆలోచనలు ఉంటాయని.. కానీ అలాంటి ఆలోచనల్ని బ్రేక్ చేస్తూ.. మహేష్ ను సరికొత్త ముఖ్యమంత్రిగా ఇందులో చూపించామంటున్నాడు దర్శకుడు కొరటాల శివ. అలాగే విదేశాలలో చదువుకుని అక్కడి నుండి ఇండియాకి  తిరిగొచ్చిన ఓ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలాంటి లుక్ ఉంటుందో రీసెర్చ్ చేసి మరీ డిజైన్ చేశామంటున్నాడు కొరటాల. మరి మహేష్ ఈ చిత్రంలో ఖచ్చితంగా స్టైలిష్ ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడన్నమాట.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఈనెల 7 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాతో కైరా అద్వానీ టాలీవుడ్ తెరకు పరిచయమౌతోంది.

Mahesh Double Treat for Fans:

Mahesh Babu Double Role in Bharath Ane Nenu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ