అల్లు అర్జున్ న్యూ ఇయర్ ఫస్ట్ ఇంపాక్ట్ హై ఓల్టేజ్ తో అదిరిపోయింది. చెప్పినట్టుగానే చెప్పిన టైం కి నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ తో వచ్చేశాడు అల్లు అర్జున్. సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త దర్శకుడు వక్కంతం వంశీని పరిచయం చేస్తూ.. 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది ఈ ఫస్ట్ ఇంపాక్ట్ చూస్తుంటే. ఆర్మీ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలో అచ్చం అలానే కనిపిస్తున్నాడు అల్లు అర్జున్ ఈ సినిమాలో.
ఆర్మీ ఆఫీసర్ లుక్ లో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ అంటే కురచగా జుట్టు కత్తిరించుకుని కోపంతో.. ఊగిపోయే పాత్రలో అదిరిపోతున్నాడు. సీనియర్ అర్జున్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ఇంపాక్ట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అయ్యేలా... రొమాన్స్ కి తగ్గకుండా.. అల్లు అర్జున్, అను ఇమ్మాన్యువల్ మధ్య మంచి రొమాంటిక్ సీన్ తో... ఆ సీన్ లో అను హైలెట్ కాకపోయినా... అల్లు అర్జున్ మాత్రం అదిరిపోయే రొమాంటిక్ మూడ్ లో కనబడుతున్నాడు. అలాగే రావు రమేష్ 'ఇలా అయితే చచ్చిపోతావ్ రా' అంటే.. దానికి అల్లు అర్జున్ 'చచ్చిపోతాను గాడ్ ఫాదర్... కానీ ఇక్కడ కాదు బోర్డర్ కెళ్లి చచ్చిపోతాను..' అంటూ అల్లు అర్జున్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో మాత్రం ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనేది క్లియర్ కట్ గా అర్ధమవుతుంది.
మరి సినిమా విడుదల ఇంకా నాలుగు నెలలున్నప్పటికీ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ఇలా అప్పుడే న్యూ ఇయర్ గిఫ్ట్ గా నా పేరు సూర్య సినిమా టీజర్ ని వదిలేశాడు బన్నీ. మరి ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ హడావిడి చేసినట్టుగానే నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ పేలింది. మరి సినిమా ఏప్రిల్ 27 ఇంకెలా పేలబోతుందో చూద్దాం.