నిజానికి ఈమద్యకాలంలో హిందువులలో కూడా చైతన్యం, ఐకమత్యం పెరుగుతున్నాయి. కారణాలు ఏవైనా, పర్యవసానాలు ఎలాగున్నా కూడా దీనిని కాస్త శుభపరిణామంగానే భావించాలి. ఇంతకు ముందు వరకు ప్రతి ఒక్కరు హిందు దేవుళ్ల మీద, హిందు మనోభావాలను దెబ్బతీస్తూ, దానినే మేధావితనంగా, లౌకికవాదంగా భావిస్తూ వస్తున్నారు. హిందు దేవుళ్లను, పూజారులను, స్వామీజీలను ఇష్టం వచ్చినట్లు చూపిస్తున్నారు. వీటిల్లో వాస్తవాలు ఉన్నా ఇదే విధమైన కామెంట్స్‌ని వీరు ముస్లింలు, క్రిస్టియన్ దేవుళ్లు, వారి మతాచారాలు, వారి పద్దతులపై విమర్శలు చేయగల దమ్ము ఉందా? అదేమంటే హిందువులలో కులాల అంతరాలు, అగ్రవర్ణాలు, దళితులు అంటూ వాదనను తప్పుదోవ పట్టిస్తున్నారు. హిందువులలో మతాలు ఉన్నట్లే ముస్లింలలో షియాలు, సున్నీలు, పఠాన్‌లు, షేక్‌లు ఇలా ఎన్నో వర్గాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు.
ఇక తామంతా దేవుడి బిడ్డలమని చెప్పుకునే క్రిస్టియన్లలో కూడా క్యాథలిక్‌లు, ప్రొటెస్టెంట్స్, బాప్టిస్టులు, లూథరన్స్, పెంతెకొస్తులు.. ఇలా ఎన్నో వర్గాలు ఉన్నాయి. క్యాథలిక్‌ల చర్చిలలో క్రీస్తు విగ్రహాలు, మేరిమాత విగ్రహాలు ఉంటాయి. కానీ మిగిలిన వారి చర్చిలలో ఆ విగ్రహాలు ఉండవు. కాబట్టే ఇలాంటివి అన్నిమతాలలోనూ ఉన్నాయి. 'మెర్సల్' చిత్రంలో జీఎస్టీపై చేసిన విమర్శలు ఓకే గానీ, దేవాలయాల కంటే ఆసుపత్రులు, మరుగుదొడ్లు ముఖ్యమనే పాయింట్ మంచిదే గానీ అదే స్థానంలో దేవాలయాలు అని కాకుండా చర్చిలు, మసీదుల కంటే మరుగుదొడ్లు, ఆసుపత్రులు ముఖ్యం అనే డైలాగ్‌ని వాడితే వారు ఒప్పుకుంటారా? అనేదే అసలు ప్రశ్న. ఇక ఈ విషయంలో 'మెర్సల్' వివాదం సమయంలో విజయ్ తండ్రి క్రిస్టియన్ అయిన ఎస్.ఎ. చంద్రశేఖర్ తీవ్ర వాదనలు, ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేసి వివాదాల పాలయ్యాడు. మరోసారి ఆయన తిరుమలలో వేంకటేశ్వరస్వామి హుండీలలో వేసే డబ్బులన్ని దేవుడికి లంచాలు అని వ్యాఖ్యానించాడు.
మరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్న రోమ్ చర్చిలో పోప్ వద్ద వేసేవి కూడా లంచాలే కదా..! ఇక ఈ వ్యాఖ్యలపై హిందు సంస్థలు మండిపడుతున్నాయి. తమిళనాడు బిజెపి నేత హెచ్.రాజా విజయ్ తండ్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. ఇక హిందు మక్కల్ కచ్చికి చెందిన నారాయణన్ అనే వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై కోర్టు పోలీసుల విచారణకు ఆదేశించింది. ఈ విషయం నిరూపితమైతే చంద్రశేఖర్‌కి మూడేళ్ల జైలు శిక్ష ఖాయంగా కనిపిస్తోంది. ఇలా కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ఎవరు, ఏమతం వారైనా తమ వ్యాఖ్యల విషయంలో కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉంది.