నటకిరీటీ రాజేంద్రప్రసాద్ కెరీర్‌ని మలుపు తిప్పన చిత్రం 'లేడీస్‌టైలర్'. ఇక నాటి సినిమా క్లాసిక్స్‌కి రీమేక్‌లు, సీక్వెల్స్ చేయడం అంత సులభం కాదు. వాటి పేర్లను పెట్టుకున్నా కూడా ఇబ్బందులు తప్పవు. దాసరి వంటి వ్యక్తే 'మాయాబజార్'ని తీసి ఫ్లాప్‌ని రుచిచూశాడు. ఇక 'శంకరాభరణం, భూకైలాస్, ప్రేమాభిషేకం' వంటి టైటిల్స్‌ని పెట్టుకోవడం కూడా ఎంత దారుణమైన ఫలితాలను ఇస్తాయో తెలిసిందే. ఇక 'జంజీర్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పనిలో పనిగా ఆర్జీవీ 'ఆగ్'ని కూడా చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం ఈవీవీ సత్యనారాయణ తీసిన క్లాసిక్ 'జంబలకిడి పంబ' పేరుతో మరో చిత్రం రూపొందుతోంది. దాని ఫలితం చూడాలి.
ఇక విషయానికి వస్తే పెద్ద వంశీ తాను రాజేంద్రప్రసాద్‌తో తీసిన 'లేడీస్‌టైలర్'కి సీక్వెల్‌గా 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' అని చేశాడు. ఇది డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో రాజేంద్రప్రసాద్ చేత కూడా ఓ పాత్రను చేయిస్తానని వంశీ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. కానీ నాటి 'లేడీస్ టైలర్'ని మించి సీక్వెల్ తీయడం అసాధ్యమని, అందునా ఫామ్ కోల్పోయిన వంశీ చేస్తే తప్పేనని పలువురు నాడు చెప్పారు కూడా. కానీ మధుర శ్రీధర్ మాత్రం అదే ఫిక్సయ్యాడు. మొదట రాజ్‌తరుణ్‌ని హీరోగా భావించారు. పరిస్థితి అర్ధమైపోయి రాజ్‌తరుణ్ నో అన్నాడు.
ఇక ఈ చిత్రంలో ఓ పాత్రను పోషించమని వంశీ.. రాజేంద్రప్రసాద్‌కి కబురు చేస్తే ఆయన మాత్రం తన మేనేజర్‌తో 'లేడీస్‌టైలర్' వంటి చిత్రానికి సీక్వెల్ చేయడం కష్టం. నాకు అందులో నటించడం ఇష్టం లేదు అని తప్పుకున్నాడని వంశీ చెప్పుకొచ్చాడు. అది రాజేంద్రప్రసాద్ సొంత నిర్ణయం. దానిని నేను తప్పుపట్టలేను అని వంశీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ చిత్రానికి చివరకు సుమంత్ అశ్విన్‌ని తీసుకున్నారు. అక్కడ కూడా పెద్ద తేడా వచ్చి దెబ్బ పడిపోయింది. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను సుమంత్ అశ్విన్‌ని తిట్టినట్లు వచ్చిన వార్తలు కూడా నిజం కాదని వంశీతేల్చేశాడు. మొత్తానికి రాజేంద్రునికి ఉన్న కామన్‌సెన్స్, జడ్జిమెంట్ పెద్ద వంశీ, మధురశ్రీధర్‌లకు లేకపోయిందనే చెప్పాలి.