Advertisementt

కొడకా.. అంటూ కుమ్మేశాడుగా..!!

Mon 01st Jan 2018 02:15 PM
pawan kalyan,agnyathavasi,kodaka koteswarravu,trivikram srinivas,agnathavasi  కొడకా.. అంటూ కుమ్మేశాడుగా..!!
Kodaka! Koteswarravu! A Blasting Song కొడకా.. అంటూ కుమ్మేశాడుగా..!!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 'అజ్ఞాతవాసి' సినిమా హడావిడి స్టార్ట్ అయ్యింది. మొన్నటికి మొన్న టీజర్ తో, ఆడియో సాంగ్స్ తో హల్చల్ చేసిన 'అజ్ఞాతవాసి' కొన్ని రోజులు ఎటువంటి హడావిడి లేకుండా.. శనివారం అజ్ఞాతవాసి వర్కింగ్ ఫోటోస్ తో పాటు... ఆదివారం పవన్ కళ్యాణ్ గొంతు సవరించిన 'కొడకా.. కోటేశ్వర రావా'  అనే పాటతో పాటు... ఆ పాట పాడిన పవన్ కళ్యాణ్ వీడియోని కూడా విడుదల చేశారు.

పవన్ కళ్యాణ్ పాడిన ఆ పాటను 'అజ్ఞాతవాసి' ఆడియో వేడుకలో విడుదల చేయకుండా ఇయర్ ఎండింగ్ పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ నిచ్చేందుకుగాను డిసెంబర్ 31 న ఈ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. మరి నిజంగానే పవన్ పాడిన ఆ పాట విజువల్స్ చూస్తుంటే కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులకి పూనకాలు వచ్చేస్తున్నాయి. పవన్ పాట పాడిన స్టయిల్, పవన్ మ్యానరిజమ్, సరదాగా నవ్వులతో సాగిన ఈ పాటని త్రివిక్రమ్, అనిరుద్, అజ్ఞాతవాసి నిర్మాత చిన్నబాబు... లిరిసిస్ట్ భాస్కర భట్ల సమక్షంలో పవన్ ఆలపించాడు. పవన్ స్టయిల్ తో పాడిన ఈ పాట మాత్రం యువతని ఉర్రూతలూగించేస్తుంది.

'అత్తారింటికి దారేది'లో పవన్ పాడిన 'కాటమరాయుడా..' పాట ఎంతగా పాపులర్ అయ్యిందో.. ఇపుడు ఈ 'అజ్ఞాతవాసి'లో.. 'కొడకా.. కోటేశ్వర రావా' అనే పాట కూడా ఖచ్చితంగా అంతే హైలెట్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. ఇక కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్  హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Click Here For Kodaka song:

Kodaka! Koteswarravu! A Blasting Song:

>Kodaka! Koteswarravu! Fantabulous Song from Pawan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ