మొదట్లో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ హీరోగా వస్తాడనే ప్రచారం జరిగింది. ఇక ఇది ఎక్కువగా కళ్యాణ్ సొంత ఊరు అయిన నెల్లూరులో హాట్‌టాపిక్‌గా మారింది. కళ్యాణ్‌కి మొదటి నుంచి హీరో కావాలనే కోరిక ఉండటంతోనే ఆయన చిరు ఇంటికి అల్లుడుగా వెళ్లాడని కూడా నెల్లూరులోని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇక కళ్యాణ్ వారిది నెల్లూరులో గోల్డ్ బిజినెస్. కళ్యాణ్ సినిమాలలోకి వస్తాడని మొదట్లో వార్తలు వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ దానిని తోసి పుచ్చింది. కానీ ఆ వార్తే ఇప్పుడు నిజం కాబోతోంది. మిగిలిన మెగాహీరోల ఎంట్రీలా హడావుడి లేకుండా సింపుల్‌గా ఎంట్రీ, సింపుల్ కథలో కళ్యాణ్ తెరకి పరిచయం కానున్నాడు.
ఆయన ప్రస్తుతం ఫైట్, డ్యాన్స్‌లలోనే కాదు.. నటనలో కూడ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకుడు. ఈయన గతంలో 'జత కలిసే' వంటి ఫ్లాప్ చిత్రం ఇచ్చాడు. ఆ తర్వాత తండ్రి కొడుకుల ఎమోషన్స్, హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్‌లో ఈ కథ రాసుకుని మొదట హీరో నిఖిల్‌కి కథ వినిపించాడట. కథ బాగుంది కానీ నాకు సెంటిమెంట్ పాత్రలు సరిపోవని నిఖిల్ చెప్పడం, దాంతో తన స్నేహితుల ద్వారా రాకేష్ శశి కళ్యాణ్‌కి కథ వినిపించడం జరిగాయి. ఈ కథ బాగా నచ్చడంతో కళ్యాణ్ తన మామయ్య చిరుకి కూడా ఆ కథను వినిపించడం, చిరంజీవికి కూడా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందని తెలుస్తోంది.
మీడియం బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి నిర్మించనున్నాడు. రాబోయే రోజుల్లో ఆయనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇక ఈ చిత్రం కథ చిరుకి నచ్చిందంటే ఇందులో ఏదో కొత్తదనం ఉండే ఉంటుంది. ప్రస్తుతం 'సై..రా' సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ చిరు, చరణ్‌లు కళ్యాణ్ చిత్రాన్ని కూడా వెంటనే పట్టాలెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.