Advertisementt

చిరంజీవికి వెన్నుపోటు పొడిచే పాత్రలో..!

Sun 31st Dec 2017 10:38 PM
jagapathi babu,sye raa narasimha reddy,villain role,chiranjeevi  చిరంజీవికి వెన్నుపోటు పొడిచే పాత్రలో..!
Jagapathi Babu in Sye Raa Negative Role చిరంజీవికి వెన్నుపోటు పొడిచే పాత్రలో..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సై రా నరసింహరెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తాజాగా యమా ఫాస్ట్ గా ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నది. ఈ సినిమాలో దేశంలోని పలు భాషా నటీనటులైన  అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, కన్నడ సుదీప్ అలాగే జగపతిబాబు వంటి వారు నటిస్తున్నారు. విజయ్ సేతుపతి ఈ మూవీలో చిరంజీవి వెన్నంటే ఉండే ఒబయ్య పాత్రలో నటిస్తుండగా.. మరో నటుడు జగపతిబాబు మాత్రం చిరంజీవిని బ్రిటిష్ వాళ్లకి పట్టించే ద్రోహిగా నటిస్తున్నాడు.

అయితే ఇప్పటికే జగపతిబాబు తాలుకు లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. త్వరలోనే జగపతిబాబు.... ఉయ్యాలవాడ పాత్రధారి సై రా నరసింహారెడ్డి (చిరంజీవి)ని వెన్ను పోటు పొడిచే సన్నివేశాలు తెరకెక్కిస్తారట. మరి ఇప్పటీకే పలు సినిమాల్లో అదిరిపోయే విలన్ పాత్రల్లో మెప్పించిన జగపతి బాబు ఇప్పుడు సై రా సినిమాలో కూడా తన విలన్ క్రూరత్వాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇకపోతే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో చిరంజీవికి గురువుగా నటిస్తున్నాడు. 

ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అవ్వని ఈ సినిమాలో హీరోయిన్ నయనతార విషయంలో ఏవేవో గుసగుసలు వినబడుతున్నాయి. ఆ వార్తల్లో నిజానిజాలెలా ఉన్నా సై రా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుండగా.... ఈ సినిమాకి రత్నవేలు కెమెరా వర్క్ ని అందిస్తున్నాడు.

Jagapathi Babu in Sye Raa Negative Role:

Jagapathi Babu is the Chiranjeevi Villain in Sye Raa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ