Advertisementt

నాకు కోపం, చిరాకు ఎక్కువే: డైరెక్టర్!

Sun 31st Dec 2017 10:09 PM
director vamsi,bhanupriya,angry,interview  నాకు కోపం, చిరాకు ఎక్కువే: డైరెక్టర్!
Director Vamsi About His Angry and Stress నాకు కోపం, చిరాకు ఎక్కువే: డైరెక్టర్!
Advertisement

తెలుగు సినిమాకి సంబంధించిన గ్రేట్‌ క్రియేటివ్‌ దర్శకుల్లో పెద్ద వంశీ ఒకరు. ఆయన చిత్రాలలోని పాత్రల క్యారేక్టరైజేషన్స్‌, పాటలు, వాటి చిత్రీకరణ ఎంతో పొయిటిక్‌గా ఉంటుంది. ఇక గోదావరి అందాలు, వారి యాస, భాషలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి ఆయన. ఇక ఆయన తీసిన చిత్రాలలో కొన్ని బ్లాక్‌బస్టర్స్‌, మరికొన్ని డిజాస్టర్స్‌ కూడా ఉన్నాయి. ఇక వరుసగా హిట్స్‌ ఇవ్వడం అనేది పెద్దగా ఆయన కెరీర్‌లో కనిపించదు. ఇక ఆయన మంచి రచయిత కూడా. తన సొంత నవలతోనే 'సితార' చిత్రం తీసి భానుప్రియను తెలుగు పరిశ్రమకి పరిచయం చేశాడు. 

'ప్రేమించు పెళ్లాడు, లేడీస్‌టైలర్‌, ఏప్రిల్‌ 1 విడుదల'వంటి చిత్రాలతో కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్‌కి స్టార్‌డమ్‌ తెప్పించాడు. ఇక ఆయన మొదటి చిత్రం 'మంచుపల్లకి' ఓ రీమేక్‌ చిత్రమైనా కూడా అందులో ఆయన చిరంజీవి, సుహాసిని, 'ఫిదా' సాయిచంద్‌, రాజేంద్రప్రసాద్‌లతో ఆ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతం. ఇంతలాంగ్‌ కెరీర్‌లో ఆయన చేసిన చిత్రాలు పట్టుమని పాతిక మాత్రమే. ఇక ఈయనకు ఇళయరాజాకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన చక్రిని బాగా సెలక్ట్‌ చేసుకున్నాడు. ఆయన సంగీత దర్శకునిగా కూడా కొన్ని చిత్రాలకు పనిచేశాడు. 

కానీ ఆయనకు మతిస్థిమితం సరిగా లేక కొంతకాలం తన సొంత ఊరికి వెళ్లిపోయి ఎవ్వరికీ కనిపించకుండా పోయాడని, ముఖ్యంగా ఆయన భానుప్రియని ఎంతో ఇష్టపడి, ప్రేమించి, ఆమె దూరం కావడం తట్టుకోలేక పోయాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈయనకు కోపం, చిరాకు అన్ని ఎక్కువే. దాని గురించి ఆయన మాట్లాడుతూ, నాకు మొదట్లో కోపం, చిరాకు వంటివి ఎక్కువే. కానీ వయసు పెరిగే కొద్ది నా కోపం కూడా తగ్గుతూ వస్తోంది. ఏదైనా పనిలో పూర్తిగా లీనమైనప్పుడు డిస్టర్బెన్స్‌ వస్తే కోపం వచ్చి ఏదేదో అరిచేవాడిని అనేది నిజమే. ఇక నాకు ఫోన్‌తో కూడా ఎక్కువ పని ఉండదు. నాకు రోజుకి రెండు మూడు ఫోన్‌ కాల్స్‌ కూడా రావు. ఇక నేను కూడా ఎవ్వరికీ ఫోన్‌ చేయను అని వంశీ చెప్పుకొచ్చాడు. 

Director Vamsi About His Angry and Stress:

Director Vamsi Personal Interview Details

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement