Advertisementt

ఈ డైరెక్టర్ అసలు ప్రభాస్ ని కలవలేదట!!

Sun 31st Dec 2017 09:55 PM
prabhas,atlee,baahubali,saaho,prabhas and atlee movie  ఈ డైరెక్టర్ అసలు ప్రభాస్ ని కలవలేదట!!
No Prabhas Movie in Atlee Direction ఈ డైరెక్టర్ అసలు ప్రభాస్ ని కలవలేదట!!
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న తాజా సినిమా 'సాహో'. ఈ చిత్రంపై బాహుబలిని మించి అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో  తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ ఫ్రెండ్స్ అయిన యువీ క్రియేషన్స్ వారు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తోంది. అయితే.... సాహో చిత్రం వచ్చే దసరాకి విడుదలవుతుందని టాక్ ఉంది కానీ క్లారిటీ లేదు. 

అయితే ప్రభాస్ సాహో పూర్త‌యిన వెంట‌నే త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కించ‌బోతోన్న ఓ చిత్రంలో న‌టించ‌బోతున్నాడ‌ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే  ఆ వార్తలన్నీ ఒట్టి  పుకార్లేన‌ని కోలీవుడ్ వ‌ర్గాల విశ్వ‌స‌నీయ స‌మాచారం. అస‌లు అట్లీ విజయ్ తో మెర్సల్ తెరకెక్కించిన తర్వాత త‌న త‌దుప‌రి ప్రాజెక్టు కోసం ఏ హీరోను క‌ల‌వ‌లేద‌ని వార్తలు వ‌స్తున్నాయి. అస‌లు అట్లీ త‌న త‌ర్వాతి సినిమాను ఇప్ప‌ట్లో మొద‌లుపెట్టే అవ‌కాశం లేద‌ని కోలీవుడ్ టాక్. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 200 కోట్లు కొల్ల‌గొట్టిన మెర్సల్ విజయంతో ప్రస్తుతం అట్లీ హ్యాపీ మూడ్ లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడని అంటున్నారు.

అయితే వాస్త‌వానికి అట్లీ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్  కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకునే ప‌నిలో ఉన్నార‌ట‌. ఆ కథ ఇంకా పూర్తిగా సిద్ధం కావాల్సి ఉందని.... కాబ‌ట్టి అట్లీ ప్ర‌భాస్ ను క‌ల‌వ‌లేద‌ని  కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే అట్లీ సిద్ధం చేసే ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కావడానికే కొన్ని నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. కథ మొత్తం పూర్తయిన త‌ర్వాతే దర్శకుడు అట్లీ..  హీరో, హీరోయిన్, ఇత‌ర నటీనటులను ఎంపిక చేసుకుంటాడట.

No Prabhas Movie in Atlee Direction:

Prabhas and Atlee Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ