Advertisementt

రజనీ అనౌన్స్ వెనుక న్యూమరాలజీ ఇదే!

Sun 31st Dec 2017 08:00 PM
rajinikanth,numerology,political announce,2.0,mahesh babu,allu arjun  రజనీ అనౌన్స్ వెనుక న్యూమరాలజీ ఇదే!
Numerology Behind Rajinikanth Political Announce! రజనీ అనౌన్స్ వెనుక న్యూమరాలజీ ఇదే!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం తమిళనాటే కాదు దేశవ్యాప్తంగా రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై తీవ్ర చర్చ సాగుతోంది. రజనీ తన ఫ్యాన్స్‌తో కలిసి ఫొటో సెషన్స్‌ నిర్వహిస్తున్నారు.ఈ రోజు ఆయన తన పొలిటికల్‌ఎంట్రీపై స్పష్టత కూడా ఇచ్చేశాడు. మరోవైపు తన నిర్ణయం ఏదైనా అభిమానులు నిరుత్సాహానికి లోను కావద్దని పిలుపునివ్వడం కాస్త గందరగోళానికి కారణమైంది. ఒకవైపు రజనీ రాజకీయాలలోకి రావడం ఖాయమని కొందరు, రాక పోవచ్చని మరి కొందరు ఇలా కన్ఫ్యూజ్ లో వున్నారు. వీటన్నిటికీ రజిని క్లారిటీ ఇచ్చేశాడు.  

మరోవైపు రజినీ తన '2.0' చిత్రం ఏప్రిల్‌ 14న తమిళ ఉగాది రోజున విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో మహేష్‌ 'భరత్‌ అనే నేను', బన్నీ 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా'లకి తమ రిలీజ్‌ డేట్‌లను ఫైనల్‌ చేసుకునే చాన్స్‌ని ఇచ్చాడు. మరోవైపు రజనీ తన పుట్టినరోజు అయిన డిసెంబర్‌ 12న పొలిటికల్‌ ఎంట్రీ గురించి చెప్పలేదు. ఇక ఎవరైనా కొత్త ఏడాదిలో కొన్ని అనూహ్య నిర్ణయాలు చెబుతారు. కానీ రజనీ మాత్రం కొత్త సంవత్సరంలో కాకుండా ఈ ఏడాది చివరి రోజైన నేడు నిర్ణయం చెప్పడం వెనుక న్యూమరాలజీ లెక్కలు ఉన్నాయని అంటున్నారు. 

రజనీకి ఆధ్యాత్మిక, జ్యోతిష్యం, న్యూమరాలజీలపై మంచి నమ్మకం ఉంది. దేశం బాగుపడాలంటే ఆధ్యాత్మిక చింతన తప్ప మరో మార్గం లేదని రజినీ నమ్ముతారు. ఇక ఆయన తన వందో చిత్రంగా ఏ మాస్‌ చిత్రాన్నో చేయకుండా, తన ఇమేజ్‌ని కూడా పట్టించుకోకుండా తనకిష్టమైన రాఘవేంద్రస్వామి చిత్రం చేసి, ఆ పాత్రలో నటించాడు. ఇప్పుడు ఆయన అభిమానులతో జరుపుతున్న ఫొటో సెషన్స్‌కి కూడా తాను కట్టించిన రాఘవేంద్రస్వామి కళ్యాణమండపమే వేదిక అయింది. 

మరోవైపు రజనీ అదృష్ట సంఖ్య 8 అని న్యూమరాలజీ నిపుణులు చెబుతుంటారు. రజనీకి కూడా ఎనిమిది అనే అంకె బాగా ఇష్టం. తన ఎవర్‌గ్రీన్‌ హిట్‌ చిత్రం 'భాషా' చిత్రంలో కూడా ఆయన 'రారా రామయ్య.. ఎనిమిది లోకం ఉంది చూడయ్యా' అనే పాటను పెట్టిన సంగతి, అది ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈరోజు తేదీని పూర్తిగా వేసి కూడితే ఎనిమిది రావడమే రజనీ ఈ రోజున తన నిర్ణయం చెప్పడానికి మూలకారణం అంటున్నారు. 

Numerology Behind Rajinikanth Political Announce!:

Success Of Rajinikanth Through Numerology!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ